గద్వాల, ఏప్రిల్ 26 : ఒకప్పుడు తెలంగాణకే తలమానికంగా నిలిచిన దాణా కర్మాగారానికి గ్రహణం పట్టింది. తెలుగు రాష్ర్టాలలోనే మొదటి పశుదాణా కర్మాగారంగా నిలిచిన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో రూ.8కోట్లతో ఏర్పాటు చేసిన టోమేటెడ్ ఫెర్టిలైజేషన్ దాణా కర్మాగారం.. నేడు కాంగ్రెస్ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాలరిస్టాలు ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గతంలో గద్వాలలో ఓ ప్లాంట్ ఉండగా దానికి అ నుబంధంగా మరొకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ పరంగా జోగుళాంబ గద్వాల జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతుండడంతో, ఇక్కడ పశువులకు పౌష్టికాహారం అందించి పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో గద్వాలలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పశుదాణా కర్మాగారం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర కృషియోజన పథకం కింద నిధులు మంజూరు చేసి పశుదాణా కర్మాగారం ఏర్పాటు చేశారు. రోజు 100 టన్నుల దాణా ఉత్పత్తి ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతుం ది. విజయడెయిరీ పేరుతో పశుదాణా మిశ్ర మ కర్మాగారం ఏర్పాటు చేసి దాని ద్వా రా దాణా విక్రయం చేపట్టారు. ఉమ్మ డి రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లాతోపాటు రంగారెడ్డి, నల్లగొ ండ, ఖ మ్మం, వరంగల్, మె దక్, నిజామాబాద్తోపా టు ఆంధ్రప్రదేశ్‌లో ని చిత్తూరు, అనంతపురం విజయడెయిరీలకు ఇక్కడి నుంచే పశుదాణా సరఫరా చేశారు. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న దాణా పరిశ్రమ నేడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. దీనికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న ప్రస్తుత దాణా కర్మాగారంలో 12 రకాల మిశ్రమాలతో కలిపి దాణాను త యారు చేస్తున్నారు. దాణా తయారీలో పుట్నాలపొడి, మి నరల్మిక్షర్, వరితవుడు, మొక్కజొన్న, పత్తిచెక్క, గోధుమపొట్టు, కొర్రపొట్టు, కాల్షియం, మోలాసిస్, బెల్లం తదితర వాటిని దాణాలో వాడుతున్నారు. వీటి ధరలు పెరిగాయనే కారణం, ఉత్పత్తి, మార్కెట్లో విక్రయాల మధ్య ధ రల వ్యత్యాసం కారణంగా 10నెలలుగా మూతపడింది. నిర్వహ 9 సా ధ్యం కాదని గుర్తించి తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సమా ఖ్య దాణా పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ప్రస్తుతం వారి ఆధ్వర్యంలో దాణా ఉత్పత్తి జరుగుతుంది. అక్కడ ఉత్పత్తి అయిన దాణాను విజయడెయిరీలో పాలుపోసే రైతులకు సబ్సిడీపై అందిస్తున్నారు. దాని ధర రూ.1300లు ఉండగా గతంలో రైతులకు సబ్సిడీ పోయి రూ.1050కు అందిస్తుండగా ప్రస్తుతం దానిని రూ. 1,230కు పెంచడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పశుదాణా కర్మాగారం నిర్వహణ భారంతో బాలారిష్టాలు ఎదుర్కొంటుంది. గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిశ్రమ నడిచి పాల ఉత్పత్తి దారులకు సబ్సిడీపై దాణా సరఫరా చేసి రైతులకు చేయూత నిచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మూత పడింది. అయితే నిర్వహణ భారం నుంచి బయటపడడానికి, మూత పడిన దాణా ఫ్యాక్టరీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముడిసరుకుల ధరలు పెరిగాయనే నెపంతో దాణా ఫ్యాక్టరీని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. గతంలో ఉమ్మడి రాష్ట్ర రైతులకు మాత్రమే సబ్సిడీపై అందించే దాణా ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో వారు ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు దాణా విక్రయిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో బాగా నడిచిన ఫ్యాక్టరీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దానిపై పర్యవేక్షణ లేకపోవడంతో 2023-2024 నుంచి నష్టాల బాట పట్టించారు. ప్రస్తుతం పశుదాణా ఫ్యాక్టరీని గుజరాత్‌కు చెందిన ఎల్డీహెచ్ ఆగ్రోఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వ పరంగా నడిచే దాణా పరిశ్రమను ముడి సరుకుల ధరలు పెరిగాయనే నెపంతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో 20మంది కార్మికులు, 10మంది ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గద్వాలలో ఉన్న పశుదాణా కర్మాగారాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని జిల్లా పాడి రైతు లు కోరుతున్నారు.