అచ్చంపేట : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి (Ambedkar Jayanthi ) సందర్భంగా సోమవారం అచ్చంపేటలో బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదేశాల మేరకు పట్టణంలోని టీచర్స్ కాలనీలో అంబేద్కర్ చిత్రపటానికి, లింగాల చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అమ్రాబాద్ సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ మాదిగ, మైనార్టీ నాయకులు అమీనుద్దీన్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దళిత బిడ్డ గువ్వల బాలరాజ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మనుపటేల్, అంతటి శివ, రమేష్ రావు, కుత్బుద్దీన్, నాయకులు గంట్ల సురేష్, రంగాపూర్ వెంకటయ్య, ఖాజా, ఇంజమూరి మల్లేష్, సోషల్ మీడియా ఇంచార్జి పిల్లి బాలరాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.