పారితోషికాలు చెల్లించాలి
పెండింగ్లో ఉన్న పారితోషికాలను చెల్లించాలని, గత ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరు తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు.
- కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన
గద్వాల, ఫిబ్రవరి 9 : పెండింగ్లో ఉన్న పారితోషికాలను చెల్లించాలని, గత ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరు తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతి నెలా 2వ తేదీన తమ ఖాతాల్లో పారితోషికాలు జమ చేసేదని, ప్రస్తుతం రెండు నెల లు దాటినా వాటిని చెల్లించక పోవడంతో అప్పులు చేయా ల్సి వస్తున్నదని వాపోయారు.
అభయహస్తం, మహాలక్ష్మి వంటి అదనపు పనులు చేయిస్తున్నారని, వాటిని తమకు అప్పగించొద్దని కోరారు. ఏఎన్సీ డెలివరీల పేరుతో టార్గెట్ పెట్టి భయబ్రాంతులకు గురిచేసే విధానాన్ని రద్దు చేయాలని, సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా కింద రూ.5లక్షలు చెల్లించాలని, ప్రమోషన్స్, ప్రసూతి సెలవులు వంటి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో కు అందజేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

