Jupalli Krishna Rao | కొల్లాపూర్ ఫిబ్రవరి 12: ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాలలో ఎదగాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో జిల్లా ఆదివాసి, గిరిజన శిక్షణా తరగతుల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు.
ఆర్థికంగా రాజకీయంగా గిరిజనులు అన్ని రంగాలలో ముందు ఉండాలని రాష్ట్ర మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలను ఉన్నత చదువులు చదివే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం ట్రైకా చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్, జిల్లా గిరిజన నాయకులు లింగన్న నాయక్, శంకర్ నాయక్, గోవింద నాయక్ తదితరులు మాట్లాడారు.