భూత్పూర్ : మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో అడ్డాకుల గ్రామ ఉపసర్పంచ్ సాయి సాగర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలకు రక్ష అన్నారు. పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్డాకుల మండల మాజీ జెడ్పిటిసి నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షులు బొక్కలపల్లి తిరుపతి రెడ్డి, మండల మాజీ కోఆప్షన్ ఖాజా గోరి, కందూర్ రమేష్, అడ్డాకుల గ్రామ బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొడ్డు రమేష్, మహేష్ యాదవ్, జహంగీర్ గోరి, జెసిబి శ్రీను, జెసిబి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.