నవాబ్‌పేట, డిసెంబర్ 30 : ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చ ర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రా వు అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని యన్మన్గండ్ల, కొల్లూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తు దాఖలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల ఆవరణలో ఏర్పాటు చేసి న కౌంటర్లు, దరఖాస్తు ఫారాలను పరిశీలించారు. అన ంతరం దరఖాస్తుదారులతో మాట్లాడుతూ దరఖాస్తు ఫారాలు ఎక్కడ కూడా కొరత లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామా ల్లో దరఖాస్తు చేసుకోలేని వారు జనవరి 6వ తేదీ వరకు ఆ యా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లో పంచాయతీ కార్యదర్శికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలత, ఏవో కృష్ణకిశోర్, ఎంపీవో భద్రునాయక్, సర్పంచులు జయమ్మహన్మంతు, సౌజన్య, లక్ష్మమ్మ, కావలి సత్యం పాల్గొన్నారు.
రాజాపూర్‌లో..
రాజాపూర్, డిసెంబర్ 30 : పేదల సంక్షేమం కోసం ప్రభు త్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కా ర్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు రా కుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ మోహన్‌రావు అన్నారు. శనివారం మండలంలో కుత్నేపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తులను ఆయన ప రిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే పథకాలను పొందేందుకు అర్హులైన పేదలందరూ దరఖాస్తు చేసుకోవాల ని తాసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీదేవి అ న్నారు. శనివారం మండలంలోని దోండ్లపల్లి, కుత్నేపల్లి, మల్లేపల్లి, మోత్కులకుంట తండాలో ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. కా ర్యక్రమంలో తాసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, డీటీ భరత్‌కుమార్, ఆర్ఐ ఖదీర్, డీటీ భరత్‌కుమా ర్, ఎంపీవో వెంకట్రాములు, ఏవో నరేందర్, సర్పంచులు సేవ్యానాయక్, రవినాయక్, లక్ష్మి, శ్యామ్‌బాయి పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, డిసెంబర్ 30 : ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫా రాలకు కొరత లేదని, ప్రజలకు ఇ బ్బందులకు గురిచేయొద్ద ని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. శనివా రం మండలంలోని రాకొండలో నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించా రు. మండలంలోని పెద్దచింతకుంట, జిన్నారం, పుసాల్పాడ్ గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్ర మం కొనసాగింది. కార్యక్రమంలో నోడల్ అధికారి రాణప్రతాప్ సింగ్, తాసీల్దార్ సునీత, ఎం పీడీవో శ్రీనివాసులు, డీటీ లతారెడ్డి, ఎంపీవో పావని, ఉన్నారు.
ధన్వాడలో..
మండలంలో గున్ముక్ల, కొండాపూర్, హన్మన్పల్లి, రామకిష్టయ్యపల్లి, మందిపల్లి గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సుదర్శన్, తాసీల్దార్ సింధూజ, ఎంపీడీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద, డిసెంబర్ 30 : ప్రజాపాలన కా ర్యక్రమంలో దరఖాస్తు ఫారాలను అందరికీ అందేలా చూడాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. శని వారం మండలంలోని ముస్తాపేటలో ప్రజాపాలన గ్రామసభను తనిఖీ చేశారు. కార్యక్రమంలో పీడీ వేణుగోపాల్, స ర్పంచ్ లాలప్ప, ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో ఉదయ్ ఉన్నారు.
మక్తల్‌లో..
మక్తల్ టౌన్/మక్తల్ అర్బన్, డిసెంబర్ 30 : మండలంలోని రుద్రసముద్రం, భూత్పూర్, టేకులపల్లి, నర్సిరెడ్డిపల్లి, మద్వార్, చిట్యాల గ్రా మాల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన ట్లు ప్రత్యేకాధికారి జాన్ సుధాకర్ పేరొన్నారు. శనివారం మండలంలో 2,286 దరఖాస్తులు వచ్చాయన్నారు. పట్టణంలోని 5, 6, 8, 9, 10 వ వార్డుల్లో ప్రజాపాలన దరఖాస్తులను కమిషనర్ బలరాంనాయక్ స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సద్గుణ, తాసీల్దార్ సువర్ణరాజ్, మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, డిసెంబర్ 30 : మండల కేంద్రంతోపా టు ఆలంప ల్లి, ఖాన్‌దొడ్డి తదితర గ్రామాల్లో శనివారం అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో యశోదమ్మ, తాసీల్దార్ దయాకర్‌రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ వాసుదేవ్‌రావు, ఎంపీవో రామన్న, ఏవో సుదర్శన్‌గౌడ్ పాల్గొన్నారు.
బాలానగర్‌లో..
బాలానగర్, డిసెంబర్ 30 : ఆరు గ్యారెంటీ పథకాల కోసం అర్హులందరూ గ్రామ సభల్లో ద రఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో కృష్ణారావు, ఎలక్ట్రికల్ ఏసీ సూపరింటెండెంట్ ఆఫీసర్ శ్రీ రామ్మూర్తి సూచించారు. మండలంలోని గుం డేడ్‌లో శనివారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.
దేవరకద్రలో..
దేవరకద్ర, డిసెంబర్ 30 : అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తాసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులు సూచించారు. శనివారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని మం డలంలోని చౌదర్పల్లి, హజిలాపూర్, వెంకటయ్యపల్లి, గదెగూడ్డెం గ్రామాల్లో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.
జడ్చర్లలో..
జడ్చర్ల/జడ్చర్లటౌన్, డిసెంబర్ 30 : ప్రభు త్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శనివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 13, 14వ వార్డు ల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మహమూద్‌షేక్ పర్యవేక్షణలో ము న్సిపల్ సిబ్బం ది వివిధ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించారు. శనివారం ఉదయం కావేరమ్మపేటలోని శిశుమందిరం పాఠశా ల, యా దిరెడ్డిబోర్ అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. బాదేపల్లి పట్టణంలోని గౌడఫంక్షన్హాల్, నల్లకుంట మినీట్యాంక్‌బండ్ వద్ద ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్ నందకిశోర్గౌ డ్, బీఆర్ఎస్ నాయకుడు ఇబ్రహీం దగ్గరుండి కౌంటర్ల వద్దకు వచ్చిన ప్రజలకు ఏవిధంగా దరఖాస్తు చేయాలనే విషయాలపై అవగాహన కల్పిస్తూ సహకరించారు.
చింతకుంటలో..
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), డిసెంబర్ 30 : కౌకుంట్ల మండలంలో పుట్టపల్లి, పేరూర్, చి న్నచింతకుంట మండలం నెల్లికొండి, లాల్కోట గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయా మండలాల తాసీల్దార్లు కృష్ణ య్య, ఎల్లయ్య తెలిపారు. చింతకుంటలో దరఖాస్తు ఫారాల కోసం గంటల తరబడి క్యూలైనులో నిలబడినా అందకపోవడంతో ప్రజలు అ సహనం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
గండీడ్‌లో..
గండీడ్, డిసెంబర్ 30 : ప్రజాపాలన దరఖాస్తుల స్వీక రణ మూడో రోజు మండలంలోని అంచన్పల్లి, చిన్నాయిపల్లితండా, రంగారెడ్డిప ల్లి, కప్లాపూర్ గ్రామాల్లో తాసీల్దార్ నాగలక్ష్మి ఆ ధ్వర్యంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 885 దరఖాస్తులు వచ్చారు.
నర్వ మండలంలో..
నర్వ, డిసెంబర్ 30 : మండలంలోని పాతర్చేడ్లో 1,148, ఎల్లంపల్లిలో 486 దరఖాస్తు లు స్వీకరించినట్లు మండల ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి శనివారం తెలిపారు. కార్యక్రమం లో సర్పంచులు కరుణాకర్‌రెడ్డి, చెన్నయ్య. తాసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీవో సుదర్శన్ ఉన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, డిసెంబర్ 30 : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతున్నట్లు ఎంపీవో శంకర్‌నాయక్ తెలిపారు. శనివారం మండలంలోని పెద్దతండాలో 260, గు వ్వనికుంట తండాలో 187, ముందలితండా లో 242 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. జ డ్చర్ల మండలంలోని అల్వాన్‌పల్లి, కుర్వగడ్డపల్లి, పెద్దఆదిరాల, చిన్నాదిరాల, కిష్ట్రంపల్లి, పెద్దతం డా గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఆరు గ్యారెంటీల దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నఆదిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో తాసీల్దార్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆరుగ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.