జోగులాంబ గద్వాల : జిల్లాలోని గట్టు మండలం మొసల్ దొడ్డి శివారులో ఈనెల 4న జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి (Accused Arrest ) రిమాండ్కు తరలించారు. శనివారం గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గద్వాల డీఎస్పీ వై.మొగులయ్య( DSP Mogulaiah) వివరాలు వెల్లడించారు.
గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన తిమ్మప్ప అన్న భార్య సువార్తమ్మతో మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహంతో అక్రమ సంబంధ కొనసాగుతుంది. అక్రమ సంబంధానికి తిమ్మప్ప అడ్డు వస్తుండటంతో అబ్రహం పథకం ప్రకారం ముసల్ దొడ్డి శివారులో తిమ్మప్ప, అబ్రహంలు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో తిమ్మప్పను అబ్రహం రాయితో కొట్టి చంపి పరారయ్యాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గట్టు ఎస్సై కెటిమల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నిందితుడు అబ్రహంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని వివరించారు . ఈ సమావేశంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, గట్టు ఎస్సై కెటిమల్లేష్, తదితరులు పాల్గొన్నారు.