వెల్దండ, ఏప్రిల్ 19 : ఇంటిపై పిడుగుపడిన ఘటన వెల్దండ మండలం నారాయణపూర్‌లో చో టు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. నారాయణపూర్‌లో శుక్రవారం సాయంత్రం భారీ గాలి దుమారం, ఉరుములు మెరుపులు వచ్చాయి. ఈ క్రమంలో సిరమోని జంగయ్య ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు ధాటికి కొం త స్లాబ్, బాత్రూం రేకులు ధ్వంసం కాగా కొన్ని దుస్తులు దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు. ఇంటి వెనుక ఉన్న రేణుక, డేరంగుల జంగయ్య పిడుగు ధాటికి కిందపడినట్లు మాజీ సర్పంచ్ అంజినాయక్ తెలిపారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్ సురేశ్ తదితరులు డిమాండ్ చేశారు.