గద్వాల అర్బన్, ఫిబ్రవరి 21 : షార్ట్ సర్క్యూట్‌తో వస్త్ర దుకాణం దగ్ధమైన ఘటన బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. జిల్లా కేంద్రంలోని చిన్నఅగ్రహారం రోడ్డులో బుధవారం ఉదయం ఒక వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో దాదాపు రూ.80 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు దుకాణ నిర్వాహకులు బోరు న విలపించారు. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దుకాణ నిర్వాహకులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ కేశవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రామన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.