మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 9 : మల్టీ డిసిప్లీనరీ డిగ్రీ (డ్యూయల్ డిగ్రీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే.శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం సాయంత్రం కేఎల్ యూనివర్సిటీ, ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు అనే అంశంపై ‘లక్ష్యం-2025’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ మేనేజర్ రాజేశ్, నమస్తే తెలంగాణ మహబూబ్‌నగర్ బీఎం రాజశేఖర్‌తో కలిసి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇంటర్ పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఉన్నత చదువులు, ఎక్కడ చదవాలనే అంశాలను విద్యార్థులకు సవివరంగా తెలిపారు. ఉన్నత చదువులు, మెరుగైన ఉద్యోగావకాశాలను పొందాలనుకునే విద్యార్థులు కే ఎల్ యూనివర్సిటీని ధీమాగా ఎంచుకోవచ్చన్నారు. కేఎల్ యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లను అంది స్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ (బీటెక్) చదివే విద్యార్థులకు ఒకేసారి రెండు కోర్సులు (డ్యూయెల్ డిగ్రీ) చదివేలా అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ప్రధానంగా బీటెక్ ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎస్ఈ బ్రాంచ్ ఒక్కటే ప్రామాణికం కాదన్నారు.
సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు కూడా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివి ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం పెద్దపెద్ద ఇండస్ట్రీలలో మల్టీ డిసిప్లీనరీ డిగ్రీ చదివిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జేఈఈలో 95 శాతం పర్సంటేజ్ సాధించిన వారికి కేఎల్ యూనివర్సిటీలో ఉచితంగా సీటును ఇస్తున్నామన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) గుర్తింపు లభించిందని, ఎన్ఐఆర్ఎఫ్ కేటగిరీ-1లో జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ పొందడంతో దేశంలోని అతికొద్ది గొప్ప డీమ్డ్ యూనివర్సిటీల్లో ఒకటిగా తమ యూనివర్సిటీ నిలిచిందన్నారు.
మామూలు యూనివర్సిటీలకు, డీమ్డ్ యూనివర్సిటీలకు చాలా తేడా ఉంటుందని వివరించారు. డీమ్డ్ యూనివర్సిటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకత, ఆవిష్కరణల శక్తిని వెలుగులోకి తీసుకొస్తాయని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులు చదివితే వారి కలలు సాకారమవుతాయని, దేశంలోని అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఉన్న త చదువుల కోసం సరైన యూనివర్సి
టీని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏం చదవాలన్నది కాకుండా ఎలా చదివామన్నది.. విద్యార్థులకు ఏ కోర్సులో ఇష్టముంటుందో.. ఆ కోర్సును చిత్తశుద్ధితో పూర్తి చేస్తే వారు జీవితంలో రాణించగలరని చెప్పారు. బైపీసీ విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ కోర్సులను అభ్యసించే అవకాశముందన్నారు. కేఎల్ యూనివర్సిటీలో చదువుకునేందుకు ‘విద్యాలక్ష్మి పోర్టల్’ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు తమ యూనివర్సిటీలో స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. కొత్త మార్పులు, నూతన అవకాశా లు అందిపుచ్చుకోవాలన్నారు.
టీసీఎస్ కంపెనీలో మొత్తం 1,800 ఉద్యోగాలకుగానూ కేఎల్‌యూ విద్యార్థులే 617 మంది సాధించారని, ఇది కేఎల్‌యూ విజయమన్నారు. అవకాశం ఉన్నప్పుడు చాలెంజింగ్ టాస్క్‌లు చేయకపోతే ముందుడుగు వేయకపోతే లక్ష్యం చేరుకోలేమన్నారు. ధైర్యం చేయా లి.. ముందుడుగు వేయాలి.. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ల్లో చేరాలని పిలుపునిచ్చారు. కేఎల్‌యూలో 88 శాతం సె ల్ఫ్ లెర్నింగ్, 12 శాతం టీచింగ్ ఉంటుందన్నారు. ఉద్యోగమే పరమావధి.. మంచి ప్లేస్మెంట్ వస్తేనే భవిష్యత్ అనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ సదస్సులో రిషి విద్యాలయ డైరెక్టర్ వెంకటయ్య, రిషి విద్యాసంస్థల డీన్ భూపాల్‌రెడ్డి, ‘నమస్తే తెలంగాణ’ ఉమ్మడి జిల్లా బ్యూరో వెంకటేశ్వర్లు, యాడ్స్ డిప్యూటీ మేనేజర్ విజయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
లక్కీ డ్రా విజేతలు :
జీ.శృతి, ఎం.శ్రీనివాసులు (వీరికి స్మార్ట్ వాచ్‌ల ప్రదానం )
ప్రతిభ కనబర్చిన విద్యార్థులు :
ఇంటర్మీడియట్లో బాలికల విభాగంలో అదితి, మేఘన, యోగిత
బాలుర విభాగంలో.. చంద్రకాంత్, ఈశ్వర్, అనాస్, మురళి ఆదిత్. (వీరికి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ తరఫున మోడల్, మొమెంటోలు అందజేశారు. )
జీవిత లక్ష్యాలపై మార్గదర్శనం
ఇంటర్ తర్వాత ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయనే విషయాలతోపాటు జీవిత లక్ష్య సాధనలో తీసుకోవాల్సిన అనేక రకాలైన అంశాలపై మార్గదర్శనం చేశారు. హైదరాబాద్, విజయవాడ బ్రాంచీల్లోని కేఎల్ యూనివర్సిటీలో తమ విద్యార్థులు సైతం ఉన్నారు. రిషి సైతం అదే తరహాలో 2016లో వేళ్లపై లెక్కించే స్టూడెంట్ సంఖ్యతో ప్రారంభించి ఇప్పుడు 2500కు పైగా విద్యార్థులతో ముందుకు సాగుతుంది. గతేడాది 24 మంది ఎన్ఐటీ, ఐఐటీలో సీట్లు సాధించారు. ఇప్పుడున్న వారిలో సైతం చాలామంది కేఎల్‌యూలో చేరేందుకు ఆతృతతో ఉన్నారు.
– భూపాల్‌రెడ్డి, రిషి విద్యాసంస్థల డీన్
‘లక్ష్యం-2025’ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం
నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ సదస్సు ద్వారా ఇంటర్ తర్వాత ఎటువంటి లక్ష్యం ఏర్పర్చుకోవాలి.. జీవితాన్ని ఎలా మలచుకోవాలనే అంశాలపై విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం అభినందనీయం. చాలా విషయాలను తమ విద్యార్థులు తెలుసుకున్నారు. విద్యార్థులు ఈ అవగాహన సదస్సు ద్వారా తాము ఎంపిక చేసుకునే కోర్సుల విషయమై ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో రెండేళ్లుగా రిషి విద్యాసంస్థల విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ఆ సంఖ్యను మరింత రెట్టింపు చేసేందుకు కేఎల్ యూనివర్సిటీ తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. ముఖ్యంగా పాలమూరులో నిరుపేద విద్యార్థులే అధికంగా ఉంటారని, వారికి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ రాయితీలు కల్పించాలని కోరారు. కేఎల్ యూనివర్సిటీతో నేరుగా సంబంధాలు నమస్తే తెలంగాణ ద్వారా రావడం ఎంతో సంతోషదాయకం.
– వెంకటయ్య, రిషి విద్యా సంస్థల చైర్మన్, మహబూబ్‌నగర్
భవితకు మార్గదర్శనం
కష్టేఫలి.. కష్టపడే వారి వెన్నంటే విజయం ఉంటుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. నేటి ఆధునిక సమాజంలో ఎన్నో అపారమైన అవకాశాలున్నా.. విద్యార్థులు, తల్లిదండ్రులకు సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన లేకపోవడం, సమాచారం తెలియక, వెనుకబాటుతనం కారణంగా చాలామంది అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇలాంటి సదస్సులతో విద్యారంగంలో ఆధునిక పోకడలు, అవకాశాలు, వనరులపై అవగాహన వస్తుంది. ఈ సదస్సులు విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికలను తెలియజేస్తుంది.
– రాజశేఖర్, నమస్తే తెలంగాణ బీఎం, మహబూబ్‌నగర్
ఏం చదవాలో తెలిసింది..
మా నాన్న రైతు. ఆయన లక్ష్యసాధనలో భాగంగా నేను కష్టపడి విజయం దిశగా పయనించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. నేడు కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన సెమినార్‌తో ఇంటర్ తర్వాత నేను ఏం చదవాలో అనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. నేను అత్యధిక ప్యాకేజీ పొందే కంపెనీలో స్థానాన్ని దక్కించుకుంటానని నమ్మకం ఉంది. కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ సైతం నాకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
– చంద్రకాంత్, విద్యార్థి
భవిష్యత్ లక్ష్యాన్ని రూపొందించుకుంటా
ఇంటర్ తర్వాత ఉన్న అనేక దారులను కలుపుకొని జీ వితంలో ఒక నిర్దేశిత గమ్యా న్ని చేరేందుకు కేఎల్ యూని వర్సిటీ నిర్వాహకులు ఇచ్చి న సెమినార్ ఎంతో నమ్మ కం అనిపించింది. తప్ప కుండా కేఎల్ యూనివర్సిటీ లో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు చక్కటి అవకాశంగా మలుచుకుంటాను. ఈ అవగాహన సదస్సుతో భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుంటాను.
– వైశాలి,విద్యార్థిని