సంప్రదాయబద్ధంగా కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

- ఆలయాన్ని ముస్తాబు చేయాలి : జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి
మూసాపేట(చిన్నచింతకుంట) : కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని జెడ్పీ చైర్పర్స్న్ స్వర్ణసుధాకర్‌రెడ్డి సూచించారు. కురుమూర్తిస్వామి ఆలయ ఈవో కార్యాలయంలో సోమవారం బ్రహ్మోత్సవాలపై ఆర్డీవో శ్రీనివాసులుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ కురుమూర్తిస్వామి జాతర ఉ త్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేయాలని సూచించారు. కొవిడ్-19 నిబంధనల మేర కు ఉత్సవాలను నిర్వహించేందుకు ఈనెల 16లోగా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధ రించి శానిటైజర్ వినియోగించాలని సూచించారు. కేబుల్ టీవీలో కూడా స్వామివారి ఉ త్సవాల ప్రసార కార్యక్రమాలను భక్తులు వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఇన్చార్జి డీఎస్పీ రాం కుమార్, డీఎంహెచ్‌వో కృష్ణ, ఎంపీపీ హర్షవర్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ వట్టెం రాజేశ్వరిరాము, సర్పంచ్ సులోచన మ్మ, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, సీఐ కిషన్, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ తాసిల్దార్ సునీల్‌కుమార్, ఎస్సై సంతోష ఉన్నారు.
తాజావార్తలు
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం
- చివరి శ్వాస వరకు అంతరిక్ష పరిశోధనల కోసమే..