వెల్దండ, ఫిబ్రవరి 25 : ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగ పంట అగ్నికి ఆహుతైన ఘటన మండలంలోని తిమ్మినోనిపల్లిలో మంగళవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల వివరాల ప్రకారం తోడేటి లక్ష్మారెడ్డి అనే రైతు తను పండించిన వేరుశనగ పంటను తీయించి మిషన్ ద్వారా పట్టించి మార్కెట్కు తీసుకుపోవడానికి కుప్పలుగా పోసి ఉంచాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం షాక్ సర్క్యూట్తో మిరుగులు పడడంతో కుప్పగా వేరుశనగకు నిప్పంటుకుంది.
అక్కడే ఉన్న రైతు లక్ష్మారెడ్డి భార్య విషయాన్ని గుర్తిం చి వెం టనే భర్తకు చెప్పగా చుట్టుపక్కల రైతులతో కలిసి మంటలార్పగా అప్పటికే దాదా పు 200 బస్తాల వేరుశనగ కాలిబూడిదై రూ.5లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. దీంతో సదరు రైతు దంపతులు లబోదిబోమంటు గుండెలు బాదుకుంటున్నా రు. ఒక్కపూట గడిస్తే పంట మొత్తం మార్కెట్కు తీసుకుపో యే వాడినని ఇంతలోనే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వం తనకు ఆర్థికసాయం చేయాలని రైతు వేడుకుంటున్నాడు. బాధిత రైతును నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.