
కొల్లాపూర్, అక్టోబర్ 18: ఎంతో చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక పుణ్యకేత్రం కొల్లాపూర్ మండలం సింగవట్నం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15కోట్లు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చొరవతో ఈ ని ధులు మంజూరైనట్లు అధికారులు చెప్పారు. ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయశాఖ మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలోనే కొత్త పింఛన్లు..
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని, అర్హులైన వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. మండలంలోని ఎల్లూరులో సోమవారం ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలతో కలిసి పర్యటించా రు. సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలుకాలనీల్లో పర్యటిం చి మాట్లాడారు. సీఎం కేసీఆర్ కొత్త పింఛన్లు మం జూరు చేయనున్నారని తెలిపారు. అర్హులైన వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. రైతు లు, రైతుకూలీలు, కార్మికులు, పేద కుటుంబాలు, పే దింటి ఆడపడుచులకు ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో రూపకంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎ మ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.