
లింగాల, సెప్టెంబర్ 19 : నల్లమల చెంచుపెంటల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. మండలంలోని ఎర్రపెంట గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.1.37 కోట్లతో నిర్మించనున్న 37 ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెంచు గిరిజనులు వెనుకబాటుతనానికి గురికాకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్డీటీ సంస్థ దేశ వ్యాప్తంగా విస్తరించి చెంచులను చైతన్యవంతులను చేస్తూ వారికి అండగా నిలవ డం శుభాపరిణామన్నా రు. డిగ్రీ పూర్తి చేసిన గౌరమ్మ ఉన్నత చదువుల కోసం జీబీఆర్ చా రిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. ఐటీడీఏ నిధులతో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలను ఆర్డీటీ సంస్థకు అప్పగించడం శుభపరిణామమన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చెంచు గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు సర్వహక్కులు కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ హన్మంత్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు రవిశంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధీర్గౌడ్, మాజీ జెడ్పీటీసీ తిరుపతయ్య, సర్పంచులు అక్కమ్మ, తిరుపతయ్య, శేషయ్య, పర్వతాలు, రవీందర్, నాయకులు తిరుపతయ్య, వెంకటగిరి, సన్నయ్య, గోవిందు, ఆర్డీటీ సంస్థ ఏరియా టీం లీడర్ సుధాకర్, చెంచు గిరిజనులు పాల్గొన్నారు.