
జడ్చర్ల, సెప్టెంబర్ 23 : పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప థకాలను అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అ న్నారు. గురువారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్‌లో 231 మంది లబ్ధిదారులకు రూ. 2,31,26,000 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పేదింటి తల్లిదండ్రులు తమ ఆ డబిడ్డలు ఎదుగుతుంటే పెండ్లి ఫికర్ ఉం డేదని, కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారన్నారు. దీంతో ధూంధాంగా పెండ్లిండ్లు జరుగుతున్నాయని చెప్పారు. నిత్యం పేదల గు రించే ముఖ్యమంత్రి ఆలోచిస్తారని, కరో నా సంక్షోభంలోనూ అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కానీ నేడు దవాఖానను ఆధునీకరించడంతో గతం లో రోజుకు 60 మంది వచ్చేవారని, నే డు 5 వందలకుపైగా దవాఖానకు వస్తున్నారని తెలిపారు. ఐసీయూ, డయాలసిస్, ఆపరేషన్లు, అత్యవసర వైద్య సేవ లు అందుతున్నాయని చెప్పారు.
కేం ద్రం నిధులు ఇస్తున్నందునే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ర్టాల్లో ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ఆయ న ప్రశ్నించారు. జడ్చర్లలో 2 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇప్పటికే వెయ్యి ఇండ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజ ల కోసం పోరాటాలు చేయడంలేదని, కేవలం అధికారం కోసమే వారి ఆరాటమని విమర్శించారు. కార్యక్రమంలో రా ష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బా ద్మిశివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ యాద య్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మా ర్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్ఐలు రాఘవేంద్ర, సు దర్శన్‌రెడ్డి, చైతన్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి, మాజీ సర్పంచ్ రేణుక, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.