ఊట్కూర్, సెప్టెంబర్ 6 : మండలంలోని పులిమామిడి గుట్టపై వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి రథోత్సవాన్ని తిలకించేందుకు సోమవారం భక్తజనం పోటెత్తింది. ఉత్సవ వే డుకల్లో భాగంగా తెల్లవారుజామున కొండపై భక్తులు అగ్ని గుండంలో నడిచారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వా మిని బంతి పూలతో ఆకర్షణీయంగా ముస్తాబు చేసిన రథం లో ప్రతిష్ఠించి ఊరేగించారు.గుట్టపై తేరును లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, సర్పంచ్ సూరయ్యగౌడ్, ఆలయ ధర్మకర్త బస్వరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై పర్వతాలు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆల య కమిటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు హాజరైన భక్తులకు తా గునీరు, వసతులను కల్పించారు.
జల్దిబిందె ఊరేగింపు
మండలకేంద్రంలోని పాత కుర్వ గేరిలో వెలిసిన భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి జల్దిబిందె ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. పంచామృతాభిషేకం, రుద్రభిషేకం, ఆకు పూజ, జల్దిబిందె సేవా కార్యక్రమం నిర్వహించారు. ఏక్లాస్పూర్ నర్సింహస్వామి ఆలయంలో హోమం నిర్వహించి జల్దిబిందె సేవ, అభిషేకాలు, భక్తులకు అన్నదాన కా ర్యక్రమం చేపట్టారు. అనంతరం వైభవంగా రథోత్స వం ని ర్వహించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ నాయకులు పాల్గొన్నారు.
కనులపండువగా పల్లకీ సేవ
శ్రావణమాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జాండ్ర కు ల సంఘం ఆధ్వర్యంలో నీలకంఠేశ్వరస్వామి పల్లకీ సేవ క నుల పండువగా నిర్వహించారు. పట్టణంలోని బాహర్పేట నీలకంఠేశ్వరస్వామి ఆలయం నుంచి పురవీధుల గుం డా పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయంలో రాత్రి భజన కార్యక్రమాలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జాండ్రకుల పెద్దలు, యువజన సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
శ్రావణమాసం సందర్భంగా మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంమ్లికుంట వీరభద్రుడి ఆలయంలో అభిషేకం, అర్చనతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో జాండ్ర కుల సంఘం ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీసేవ ఊరేగింపు, అభిషేకం, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు
మండలంలోని లోకపల్లి లక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేపట్టి, అభిషేకం, నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.