
హన్వాడ సెప్టెంబర్ 19: మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో కృష్ణ అన్నారు. మండలంలోని కొనగట్టుపల్లిలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలన్నారు. ఇంటింటా వెళ్లి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి వ్యాక్సిన్ తీసుకునేలా కృషిచేయాలన్నారు. ప్రతిఒక్కరినీ ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయనిర్మల, సర్పంచ్ మానస, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
మండలంలోని 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మండల మెడికల్ అధికారి నరేశ్ సూచించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించారు. మండలంలో 18కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ వేస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వాక్సినేషన్ కేంద్రం పరిశీలన
అడ్డాకులలో కరోనా వాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీడీవో మంజుల ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వాక్సిన్ తీసుకుంటేనే వైరస్‌ను అదుపు చేయవచ్చని సూచించారు.
కరోనాను నివారిద్దాం
కరోనా నియంత్రణకు 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎంపీపీ సుశీల అన్నారు. ఆదివారం తిర్మలాపూర్ పంచాయతీ పరిధిలోని నర్సంపల్లితండాలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీకా తీసుకుంటే ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని, అపోహలు మాని వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఉపసర్పంచ్ శంకర్‌నాయక్, రమేశ్‌నాయక్, భాస్కర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ టీకా వేయించుకోవాలి
కరోనా బారినపడకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సర్పంచ్ రమేశ్‌నాయక్ అన్నారు. మండలంలోని బోడగుట్టతండాలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం పరిశీలించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు తదితరులు ఉన్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్
మున్సిపాలిటీలోని అన్నివార్డుల్లో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆదివారం ఆయా వార్డుల్లో మున్సిపల్, వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. వార్డుల్లో ఏర్పాటు చేసిన కేంద్రం లో వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రక్రియ పూర్తి చేసేందుకు మున్సిపల్ అధికారులు అన్నిచర్యలు తీసుకుంటున్నారు.