
ఊట్కూర్, ఆగస్టు 10 : మత సామరస్యానికి ప్రతీక, నిఖార్సైన తెలంగాణ జానపద సంస్కృతికి ఊట్కూరు పీర్ల పండుగ ఒక నిండు ఉదాహరణ. ఈ ఉత్సవం మొహర్రం నెల చంద్రోదయంతో మొదలై పౌర్ణమి నాటికి ముగుస్తున్న ది. పండుగ సందర్భంగా పీర్ల మసీదుకు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అందం గా అలంకరించారు. గ్రామానికి చెందిన వారు ఎక్కడ నివసిస్తు న్నా పండుగకు ఊరికి తప్పకుండా చేరుకుంటారు. ప్రతి గడప తమ ఆడ బిడ్డల్ని, బంధుమిత్రుల్ని పిలుచుకుంటుంది. పీర్ల ప్రతి ష్ట అనంతరం పెండ్లిండ్లు, నూతన గృహ ప్రవేశం, ఇతర శుభకార్యాలను సైతం ఇక్కడి వారు వాయిదా వేసుకుంటారు. ఈ నెల 19, 20న సవారీ నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యు లు సకల ఏర్పాట్లు చేశారు.
అన్మదమ్ముల ప్రాణత్యాగానికి గుర్తింపుగా
ఇరాక్ దేశంలోని కూఫా నగరం కర్భ ల ప్రాంతంలో క్రీ.శ 1400 ఏండ్ల కింద ట శాంతి, సామరస్యాల కోసం జరిగిన యుద్ధంలో ప్రవక్త మనుమలు హసన్-హుసేన్ అన్నదమ్ముల ప్రాణత్యాగానికి గు ర్తింపుగానే భక్తులు ప్రతి ఏటా పీర్ల సవారీ నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతున్నది. పూ ర్వం ఇస్లాం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం గా యాజిద్ రాజ కుమారుడు వారసత్వంగా తననే ప్రభువుగా ప్రకటించుకునేందుకు ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో యాజిద్ చర్యలకు వ్యతిరేకంగా కూఫా ప్రాంత ప్రజలు ప్రవక్త మనుమడు, బీబీ ఫాతిమా కుమారుడైన హిమాం హుసేన్‌కు యాజిద్ దు ర్మార్గపు చర్యలను వివరిస్తు లేఖలు రాశారట. యాజిద్‌కు నచ్చజెప్పేందుకు 72 మంది మహిళలు, పిల్లలు (సైన్యంతో) వె ళ్లిన హిమాం హుసేన్‌ను కర్బల ప్రాంతం లో యాజిద్ ప్రభువుకు చెందిన సైనికు లు బంధించి చిత్రహింసలు పెట్టి చంపిం ది. యుద్ధంలో వెంట వెళ్లిన హిమాంహుసేన్ సోదరుడు హిమాంహసన్ సైనిక చర్యల్లో మృతి చెందాడు. నాటి హసన్-హుసేన్ ప్రాణత్యాగానికి ప్రతీకగా అన్ని గ్రామాల్లో భక్తులు పీర్ల పండుగను జరుపుకొంటున్నారు.
వైభవంగా డోలారోహణం
ఉత్సవ వేడుకల్లో ప్రధాన ఘట్టం డోలారోహణం. మండలకేంద్రంలోని రుద్రానగర్లో జరిగే డోలారోహణం సందర్భంగా ఆరకటికె వంశస్తుల కుటుంబాల్లో పుట్టిన పిల్లలను ఊయల వేస్తారు. పీర్లు ఎత్తిన వ్యక్తులతో పిల్లలకు నామకరణం చేయిస్తా రు. వేడుకల్లో పాల్గొని ప్రసాదం దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. ప్రసాదం దక్కించుకున్న వారికి సంతాన యో గ్యత కలుగుతుందనేది భక్తుల నమ్మకం.
పుట్టిన పిల్లలకు హసన్, హుసేన్ పేర్లు
సంతానం లేని వారు హసన్, హుసేన్ పీర్లను దర్శించుకుంటే తమకు సంతాన యోగం కలుగుతుందని భ క్తులకు అపారమైన నమ్మకం. ఆ నమ్మకంతో నే తమకు కలిగిన సంతానికి హసన్, హుసేన్ పీర్ల దేవుళ్ల మొదటి అక్షరం కలిసి వచ్చే వి ధంగా నామకరణం చేస్తారు. ప్రత్యేకించి ఊ ట్కూరుతోపాటు పరిసర గ్రామాల్లో పలువు రి పేర్లు ఉసేనప్ప, ఆశప్ప, చిన్న ఊశన్న, పెద్ద ఊశన్న, చిన్న ఆశప్ప, ఈశప్ప, ఆనందు, అశో కు, హుసేన్సాబు, హసన్సాబు, ఆశమ్మ, ఊశ మ్మ, ఉష, ఊర్మిళ, ఉసేనమ్మ, హుసేన్‌బీ, ఆశా బీ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి.
ఎమ్మెల్యే సహకారంతో మసీదు నిర్మాణం
మండలకేంద్రంలో ని పెద్దపీర్ల గడ్డలో ఉన్న హసన్, హుసేన్ పీర్ల మసీదును భక్తులు ఏ డాది పొడవునా దర్శించుకుంటారు. ఈ దేవుళ్లకు గల్లీ నుంచి ఢిల్లీ వ రకు భక్తులు ఉన్నారు. భక్తులు చేయాల్సిన ప్రతి శుభ కార్యాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. ప్రతి ఏడాది జరిగే పీర్ల ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థాన్ని పురాతనమైన మసీదు స్థానం లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రూ.10 లక్షల నిధుల తో నూతన మసీదు నిర్మాణ పనులు పూర్తి చేయించారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
మొహర్రం ఉత్సవ వేడుకల కోసం గ్రామానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేశాం. అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ తరఫున పారిశుధ్య చర్యలు చేపట్టినం. భక్తులకు తాగునీటి, వసతి కోసం ప్రత్యేక కొళాయిలను ఏర్పాటు చేయించాం. ఊరేగింపు సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అంతర్గత రహదారులపై మట్టి వేసి గుంతలను పూడ్చి వేశాం. భక్తులు కందూర్లు నిర్వహించేందుకు, చిరు వ్యాపారులు గుడారాల ఏర్పాటుకు వసతులను కల్పిస్తాం. అందరి సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం.
ఇంటి దేవుడిగా కొలుస్తున్నాం..
నా పేరు ఆశయ్యగౌడ్. మా తల్లిదండ్రులకు మేము మొత్తం ఏడుగురు సంతానం. హసన్, హుసేన్‌లను ఇంటి దేవుడిగా పూజిస్తాం. సంతానం కలుగలేదని మా తల్లిదండ్రులు గో విందప్పగౌడ్, నర్సింగమ్మ హసన్ హుసేన్‌ల దర్శన భాగ్యంతోనే సంతానం కలిగింది. దీంతో దేవుడి పేరు లో మొదటి అక్షరం వచ్చే విధంగా నా పేరును ఆశయ్యగౌడ్ నా తోపాటు మా అన్నల పేర్లు ఊషన్నగౌడ్, అశోక్‌గౌడ్, ఉశోక్గౌడ్, మా అక్కల పేర్లు చిన్న ఆశమ్మ, పెద్ద ఆశమ్మ, ఉషనమ్మ అని నామకరణం చేసిండ్రు. మా కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా హసన్, హుసేన్ మసీదును దర్శించుకొని ప్రారంభం చేస్తాం.