
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 1 : కరోనాను కట్టడి చేసేందుకు 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. పురపాలిక సంఘంలోని 2వ వార్డు ఏనుగొండలో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి వార్డులో 90శాతం వ్యాక్సిన్ వేయడం అభినందనీయమన్నారు. అనంతరం వార్డు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
వ్యాక్సినేషన్‌పై అవగాహన
మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 5, 24 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ పాలాది సారికతోపాటు కమిషనర్ సునీత, అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. 18ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నవనీత, ఏఎన్ఎం లక్ష్మి, మున్సిపల్, వైద్యసిబ్బందితోపాటు టీఆర్ఎస్ నాయకులు కొండల్, రామ్మోహన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
అపోహలు వద్దు
కొవిడ్ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు అవసరంలేదని ఎంపీవో శ్రీదేవి అన్నారు. మండలంలోని వాయిల్కుంటతండాలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపీనాయక్, పంచాయతీ కార్యదర్శి దస్రూనాయక్, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్‌కు సహకరించాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేసేందుకు అంద రూ సహకరించాలని మండల ప్రత్యేకాధికారి సాయిబాబా కోరారు. మండలంలోని శేరిపల్లి(హెచ్) వ్యాక్సినేషన్ కేంద్రా న్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శేరిపల్లి (హెచ్), భట్టుపల్లి గ్రామాల్లో వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యసిబ్బందిని ప్రత్యేకాధికారి అభినందించారు. కార్యక్రమంలో సర్పంచులు ఆంజనేయులు, శేఖర్, సీహెచ్‌వో రామయ్య, ఏఎన్ఎంలు విజయ, సుమతమ్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.