
జడ్చర్లటౌన్, ఆగస్టు 26 : జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామంలోని వాటర్‌ప్లాంట్ నీటి కాలుష్యంపై వచ్చిన ఫి ర్యాదు మేరకు లోకాయుక్త విచారణ క మిటీ పరిశీలించింది. కమిటీ డైరెక్టర్ డా క్టర్ వెంకట్రావు నేతృత్వంలోని బృం దం గురువారం పర్యటించింది. వాటర్‌ప్లాంట్‌లో శుద్ధిచేయని నీటిని గ్రామ శి వారులోని రంగనాయక చెరువులోకి వ దిలిపెడుతున్నారని, తద్వారా చేపలు చ నిపోతున్నాయని 2016లో పలువురు రైతులు లోకాయుక్తలో కేసు వేశారు. కే సు విచారణలో భాగంగా సభ్యులు వా టర్ప్లాంట్తో పాటు చుట్టు పక్కల పం ట పొలాలను, చెరువును క్షుణ్ణంగా పరిశీలించారు. కమిటీ సభ్యులు వాటర్‌ప్లాంట్ నిర్వాహకులు, రైతులు, గ్రామస్తులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. వ్యవసాయ బోర్లను వినియోగిస్తూ వాటర్‌ప్లాంట్ ద్వారా నీ టిని విక్రయించుకుంటున్నారని కొంద రు రైతులు కమిటీ దృష్టికి తీసుకొచ్చా రు. కాలుష్యమైన నీటిని చెరువులోకి వ దలడంతో చెరువులోని చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట్రావు వి లేకరులతో మాట్లాడారు. పూర్తి విచారణ తదుపరి నివేదికను లోకాయుక్తకు సమర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో లోకాయుక్త విచారణ కమిటీ డి ప్యూటీ డైరెక్టర్ ముత్యంరావు, విచారణ అధికారి ఎన్. విద్యాసాగర్, మహబూబ్‌నగర్ ఆర్డీవో పద్మశ్రీ, డీపీవో వెంకటేశ్వర్లు, భూగర్భ జలవనరుల శాఖ డి ప్యూటీ డైరెక్టర్ రాజేందర్‌కుమార్, పరిశ్రమల శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి, కా లుష్యనియంత్రణ మండలి ఈఈ ద యానంద్, ఏఈఈ సంగీతలక్ష్మి, మ త్స్యశాఖ ఏడీ రాధారోహిణి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎస్సై శంషొద్దీన్ ఉన్నారు.