
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 24 : పిల్లల్లో నులిపురుగుల వ్యాప్తితో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం, చెప్పులు లేకుండా తిరగడం, భోజనం చే శాక, చేయకముందు చేతులు శుభ్రపరుచుకోకపోవడంతో చిన్నారులు తరుచూ అనారోగ్యానికి గురువుతున్నారు. కడుపునొప్పి, విరేచనాలు తదితర వ్యాధు ల బారిన పడుతున్నారు. కడుపులో నులి పురుగుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇది శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో నులిపురుగుల నివారణే లక్ష్యంగా, పిల్లల సంరక్షణకు ప్రభు త్వం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏడాదికి రెం డు సార్లు నులిపురుగుల నివారణ దినం నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ చేపట్టనున్నారు. 1-19 ఏండ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు జిల్లాలోని ఇంటింటికీ వెళ్లి పిల్లలకు మాత్రలు వేయనున్నారు.
వ్యాప్తి ఇలా..
ఏలిక (నట్టలు) పాములు, నులి పురుగులు, కొం కి పురుగులు అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. నులి పురుగులు పేగు నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులు. ఇవి అపరిశ్రుభత, ప రిసరాలతో చిన్నారుల కడుపులోకి చేరుతాయి. నేల లో గుడ్లు, లార్వాలుగా వృద్ధి చెందుతాయి. పిల్లలు మట్టిలో ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా ఆ హారం తీసుకోవడం ద్వారా కడుపులోకి వెళ్తాయి. నీటి ని శుద్ధి చేయకుండా తాగడం వల్ల కూడా పురుగులు కడుపులోకి వెళ్తాయి. ఇవి 19 ఏండ్ల లోపు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
నివారణ చర్యలు..
గోళ్లను శుభ్రంగా, చిన్నవిగా ఉంచుకోవాలి.
ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే తాగాలి.
ఆహారంపై పాత్రలు కప్పి ఉంచాలి.
పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడిగి తినాలి.
భోజనం చేసే ముందు, మల విసర్జన అనంతరం చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయొద్దు.
మాత్రలు వేసుకునే పద్ధతి..
ఒకటి నుంచి రెండేండ్ల పిల్లలకు సగం మాత్ర వేయాలి.
2 నుంచి 19 ఏండ్ల వారికి ఒక మాత్రను పొడి చేసి వేయాలి.
తప్పనిసరిగా తిన్న తర్వాతే మాత్ర వేసుకోవాలి.
నేటి నుంచి ఉచితంగా పంపిణీ..
స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాది నుంచి ఐ దేండ్ల లోపు పిల్లలకు ఉచితంగా మాత్రలు అందిస్తా రు. మాత్రలను శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది వద్దే తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మాత్ర వేసుకోవద్దు. మహబూబ్నగర్ జిల్లాలో 19 ఏండ్ల లోపు పిల్లలు 2,78,511 మంది ఉన్నారు. వీరికి 3,70,845 మా త్రలు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమ నిర్వహణకు ప్రోగ్రాం అధికారులు, 23 మంది మెడికల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మండల వైద్యాధికారులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు.
పిల్లల ఎదుగుదలపై ప్రభావం..
నులిపురుగులు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అనేక సమస్యలు తలెత్తుతాయి. నులి పురుగుల నివారణ కోసం ఏడాదికి రెండు సార్లు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. ఈ మాత్రలు వాడకం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. నులిపురుగుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి.