
ఊట్కూర్, సెప్టెంబర్ 30 : టీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలోనే ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కిందని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్ అన్నారు. ప్ర భుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం పెంచడంతో గురువారం ఎంపీపీ భవనంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన గౌరవ వేతనాలను సర్పంచులు, ఎం పీటీసీలు సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధిలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. గౌరవ వేతనం పెంచ డంపై సర్పంచుల సంఘం జిల్లా గౌర వ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎ ల్లాగౌడ్, పీఏసీసీఎస్ చై ర్మన్ బాల్‌రెడ్డి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పార్టీ అనుబం ధ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకు లు తదితరులు పాల్గొన్నారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే నివాసంలో సీఎం చి త్రపటానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి, పలువురు సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు గౌర వేతనాన్ని 30శాతం పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య, నేరడిగాం సర్పంచ్ అశోక్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ కమిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి తా యప్ప తదితరులు పాల్గొన్నారు.