
భూత్పూర్, సెప్టెంబర్ 30 : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భూత్పూర్లోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆల దంపతు లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్ సూచన మేరకు 500 జమ్మి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, సంగీత,నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, వైస్ ఎంపీపీ నరేశ్‌గౌడ్, నాయకులు సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, అశోక్, సాయిలు, వెంకట్రాములు, బోరింగ్ నర్సింహులు, ప్రేమ్, సర్పంచ్ ఆంజనేయులు, రామునాయక్, గోపాల్, తారు తదితరులు పాల్గొన్నారు.
నువ్వు ఇబ్బంది పడకు..నేనే వస్తా
ఎమ్మెల్యే ఆలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అన్నాసాగర్‌కు చేరుకున్నారు. అయితే భూత్పూర్కు చెందిన దివ్యాంగుడు గడ్డం యాదయ్య ఎమ్మెల్యేకు దండ వేసి శుభాకాంక్షలు చెప్పాలని ఆతృతగా చూస్తుండగా, ఎమ్మెల్యే గమనించి యాదయ్య చెంతకు వెళ్లి దండ వేయించుకున్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 30 : మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి.. స్వీట్లు పంపిణీ చేశారు. కందూరులో ఉపాధి హామీ కూలీలకు ఎంపీటీసీ శ్యామలమ్మ, ఆమె కుమారుడు రమేశ్‌గౌడ్ రగ్గులు పంపిణీ చేశారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అడ్డాకుల బస్టాండ్‌కు చేరుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, వైస్‌ఎంపీపీ రాచాల రాధిక, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బీ తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ రంగన్నగౌడ్, భీమన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
ఎమ్మెల్యే ఆల పుట్టినరోజు సందర్భంగా స్థానిక అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఏనుగొండ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ కళావతీకొండయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు.