
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 6 : సమాజం లో ఉపాధ్యాయులు, జర్నలిస్టులది కీలకపాత్ర అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపా రు. ఉపాధ్యాయ, జర్నలిస్టు దినోత్సవం సందర్భంగా మహాలక్ష్మి సేవా ట్రస్టు ఆ ధ్వర్యంలో సోమవారం జడ్చర్లలోని స త్యేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన సన్మా న కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులు, ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, సమాజ శ్రేయస్సు కోసం జ ర్నలిస్టులు పనిచేస్తారన్నారు. సోషల్‌మీడియాలో అర్థంలేని పోస్టులు పెడుతున్నారని, దీనిపై మీడియా దృష్టి సారించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జడ్చర్ల లారీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌ను ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మహాలక్ష్మీ సేవా ట్రస్టు చైర్మన్ ఈశ్వర్, రామకృష్ణ, కౌన్సిలర్లు ఉమాదేవి, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
డబుల్బెడ్రూం ఇండ్ల పరిశీలన..
జడ్చర్ల మున్సిపాలిటీలోని హరిజనవాడలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. జడ్చర్ల తాసిల్దార్ కార్యాలయ భవనాన్ని సందర్శించి, నూతన భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను పరిశీలించా రు. ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే జడ్చర్ల జాతీ య రహదారి ఫ్లైఓవర్బ్రిడ్జి ప్రధాన కూడ లి ప్రాంగణాన్ని పరిశీలించారు. కూడలి లో గ్రీనరీ ఏర్పాటు చేసి సుందరంగా తీ ర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ సునీతను ఆదేశించారు. కూర్చునేందుకు బెం చీలు ఏర్పాటు చేయాలన్నారు.