
మక్తల్ టౌన్/ఊట్కూర్, డిసెంబర్ 13 : రైతుకు మిం చిన విజ్ఞానవంతుడు లేడని.. ఆకలి కేకలు ఉన్న ప్రాంతంలో ఆహార నిల్వలు పెంచే స్థాయికి చేరుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మక్తల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇతర పంటల సాగుపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల ది శాస్త్రవేత్తలకు మించిన ఆలోచన అని, నష్టం వచ్చినా వ్యవసాయం మాత్రం విడిచిపెట్టరన్నారు. ఒకప్పుడు 80 నుంచి 85 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడేవారని, ఇప్పుడు వ్యవసాయ రంగంపైనే 60 శాతం మంది జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే 2.40 కోట్ల మందికి మేలు చేకూరుతుంద ని, ఐటీ శాఖలో 15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, అందుకే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంపై దృష్టి సారించారన్నారు. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల సాగుభూమి ఉ న్నదని, ఏటా 80 లక్షల మందికి రైతుబంధు సాయం అం దుతుందని చెప్పారు. పంజాబ్‌లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని, తెలంగాణలో 3 కోట్ల మెట్రిక్ ట న్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు.
ఆహార నిల్వలు ఎ క్కువై కేంద్రానికి, రాష్ర్టానికి పంచాయితీ పడిందన్నారు. మ హారాష్ట్ర, గుజరాత్ల కంటే తెలంగాణలో పత్తి అధికంగా పం డుతుందని, అందుకే సీసీఐకి అధిక లాభాలు వచ్చాయని చెప్పారు. ఇక్కడ పండించే పత్తికి చాలా డిమాండ్ ఉందని, వరికి బదులు పత్తి సాగుపై రైతులు దృష్టి సారించాలని కో రారు. వానకాలంలో వరి వేసుకోవచ్చని, యాసంగిలో మా త్రం పంట మార్పిడి చేపట్టాలన్నారు. మిల్లర్లు వరి కొంటామని హామీ ఇస్తే వరి సాగు చేసుకోవచ్చన్నారు. ధాన్యం కొ నడం, సరఫరా చేయడం ఎఫ్‌సీఐ బాధ్యత అని అన్నారు. దేశాన్ని నడిపే కేంద్ర ప్రభుత్వానికి గోదాంలు నిర్మించాలన్న ఆలోచన లేదా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో కేం ద్ర ప్రభుత్వం మూడు నెలలపాటు ఆరు కేజీల బియ్యాన్ని పంపిణీ చేసిందని, ప్రతి మనిషికి 20 కేజీలు ఇస్తే ఏమయ్యే దన్నారు. ఎఫ్‌సీఐ వద్ద చాలా ధాన్యపు నిల్వలు ఉన్నాయని, మిగిలిన ధాన్యాన్ని గోదాముల్లో పందికొక్కులకు పెడుతున్నారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను బదనాం చేయాలని చూస్తుందన్నారు. ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని.. ఖమ్మం, కొత్తగూడెంలో 50 నుంచి 60 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుందన్నారు. నియోజకవర్గ రైతులను వ్య వసాయ అధికారులు ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.
ఆయిల్‌పాం విత్తనాలు ఇండోనేషియా, మలేషియా, కోస్టారికా దేశాల్లో లభిస్తాయని, అలాంటి విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచిందని తెలిపారు. దేశంలో 21 మిలియన్ టన్ను ల వంట నూనె అవసరమైతే.. కేవలం 7 మిలియన్ టన్ను లు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. మలేషియా, ఇండోనేషియా నుంచి 80 వేల కోట్ల వంట నూనె దిగుబడి చేసుకుంటున్నామని వివరించారు. అందుకే డిమాండ్ ఉన్న ఆయిల్‌పాం సాగు చేపట్టాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తున్నట్లు చెప్పారు. కొందరు బాధ్యత లేకుండా రా జకీయాలు చేస్తూ.. రైతుల జీవితాలను ఆగం పట్టిస్తున్నారన్నారు. ఆఫ్లోటాక్సిన్ రహిత వేరుశనగకు ఉమ్మడి పాలమూ రు ప్రసిద్ధి అని అన్నారు. అరటి, చెరుకు పంటలను కూడా సాగు చేయొచ్చన్నారు. పొలం గట్లపై శ్రీగంధం చెట్టు పెట్టు కోవచ్చన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా త్వర లో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించి ఏక కాలంలో రైతు లకు పంట సాగు, వ్యవసాయాభివృద్ధిపై శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఆయిల్‌పాం సాగు చేయడాన్ని చూసి నియోజకవర్గంలో 200 మంది రైతులు ఆ దిశగా దృష్టి సా రించారన్నారు. వరి బదులు ఇతర పంటలను సాగు చేయా లని కోరారు. అలాగే శాస్త్రవేత్తలు చెరుకు, వేరుశనగ వంటి పంటల సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నారాయణపేట కలెక్టర్ దాసరి హరిచందన, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీ చైర్పర్సన్ వనజ, రైతుబంధు సమితి జి ల్లా సభ్యురాలు చిట్టెం సుచరితరెడ్డి, డీఏవో జాన్ సుధాకర్, ఏడీఏ దైవగ్లోరి, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ దామోదర్రాజ, శాస్త్రవేత్తలు శ్రీధర్, డా.విజయ్ కుమార్, శ్రీనివాస్, మమత, ఆదిశంక ర్, దివ్య, రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.