మంగళవారం 20 అక్టోబర్ 2020
Mahabubabad - Sep 28, 2020 , 05:52:48

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

  • మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య 

పెద్దవంగర(తొర్రూరు): పరిశుభ్రతతోనే సంఫూర్ణ ఆరో గ్యం సాధ్యమని మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచం ద్రయ్య అన్నారు. ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా డివిజన్‌ కేంద్రంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రా వణాన్ని పిచికారీ చేయించాలన్నారు. గతంలో చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో ప్రజలకు ఎంతో మేలు జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సురేం దర్‌రెడ్డి, కౌన్సిలర్లు రోజా, సునీతాజైసింగ్‌, శంకర్‌, రాము, మాధవీఅనిల్‌, గజానంద్‌, రాజు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులు దూరం

డోర్నకల్‌ : పరిసరాల శుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులు దూరమవుతాయని మున్సిపల్‌ చైర్మన్‌ వీరన్న అన్నారు. ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో భా గంగా 9వ వార్డులో పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం ఆయన 9వ వార్డులో రూ.42లక్షల వ్యయం తో తాగునీటి పైపులైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్ర మాల్లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కో టిలింగం, పట్టణ అధ్యక్షుడు వి ద్యాసాగర్‌, కౌన్సిలర్లు శరత్‌బా బు, రాధికావీరన్న, జనార్దన్‌, య శోధర్‌జైన్‌, సురేందర్‌ జైన్‌, సంధ్యారమేశ్‌, శేఖర్‌, కోఆప్షన్‌ సభ్యులు రాంభద్రం, అజిత్‌ మి యా, నాయకులు  పాల్గొన్నారు.


logo