కవి సంధ్య, యానాం-హైదరాబాద్, చిన్న నారాయణరావు సాహితీ ఫౌండేషన్, నెల్లూరు సంయుక్త నిర్వహణలో.. 2025, మార్చి 23 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని కమిటీ హాల్లో ప్రపంచ కవితా దినోత్సవ సభ జరుగనున్నది. అదే సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సుధామ అధ్యక్షతన కవి సమ్మేళనం జరుగనున్నది.
సాయంత్రం 6 గంటలకు శిఖామణి అధ్యక్షతన జరిగే సభలో దర్భశయనం శ్రీనివాసాచార్య ‘కవిత్వం-ప్రయోజనం’ అంశంపై ప్రత్యేక ప్రసంగం చేస్తారు. కవితల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుంది. ముఖ్య అతిథిగా ఆచార్య ఎన్.గోపి హాజరుకానుండగా, గౌరవ అతిథులుగా ఓల్గా, దీర్ఘాశి విజయ్‌కుమార్, మామిడి హరికృష్ణ, ఏనుగు నరసింహారెడ్డి, కొప్పర్తి, ప్రసాదమూర్తి, యాకూబ్, కోడూరి విజయ్ కుమార్, కోయి కోటేశ్వరరావు, చిన్ని నారాయణరావు పాల్గొననున్నారు.