నెత్తురు వొలికిన నేల మీద
మెరుగులు దిద్దిడం కాదు
మాకిప్పుడు కీరవాణి లేని
సంగీతం కావాలి!
మమ్మల్ని మైమరిపించే
రికార్డ్ బ్రేక్ డాన్సులు వద్దు
ఐకమత్యాన్ని పెంపొందించే
లౌకిక గీతం కావాలి!
మీ వామన పాదాలు
వందలాది మందిని బలి తీసుకున్నవి
భాషను, యాసను, సంస్కృతిని
కాలరాసిన మాయల మరాఠీల చేతిలో
నా రాష్ట్ర గీతం!
మా చావులకు కారణమైనోడే
అమరత్వాన్ని వెల కడుతుండు
దోపిడీ, వంచన జతకట్టి
త్యాగమే నాదంటున్నారు!
ఒకప్పుడు యుద్ధ గీతం
ఇప్పుడు రాష్ట్ర గీతం
పాటకు ప్రాణం పోసిన అందెకు
వేటగాడు గీతను బోధిస్తుండు!!
-ఎదిరెపల్లి కాశన్న
96400 06304