తన సాహిత్య స్వర్ణోత్సవం సందర్భంగా స్మారక కథల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించనున్నట్టు సింహప్రసాద్ సాహిత్య సమితి కన్వీనర్ సింహప్రసాద్ తెలిపారు. ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల’ అనే అంశాలపై మూడు కథలకు రూ.2 వేలు వంతున బహుమతులు అందజేస్తామని తెలిపారు.
50 ఏండ్లు దాటనివారే ఈ పోటీలకు అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి గలవారు తమ కథలను 20-8-2026లోగా సింహప్రసాద్ సాహిత్య సమితి, 401, మయూరి ఎస్టేట్స్, ఎంఐజీ-2-650 కేపీహెచ్బీ కాలనీ, హైదరాబాద్-500072 అనే చిరునామాకు పంపాలని కోరారు. లేదా SriSri.kathalapotee@gmail.com కు పంపాలని పేర్కొన్నారు.