జలకళ మృగ్యమై
చెమ్మగిల్లిన నేత్రాలు మావి సొమ్మసిల్లిన దేహాలు మావి దురదృష్టం కోరలతో రక్తసిక్తులం
చెమ్మగిల్లిన నేత్రాలు మావి
సొమ్మసిల్లిన దేహాలు మావి
దురదృష్టం కోరలతో రక్తసిక్తులం
దుర్భిక్షం కాట్లతో రిక్తఅస్తికలం
మా కష్టం సత్యం
మా నష్టం నిత్యం
మా ఇళ్లు దుర్భరస్థితిగతులకు నకళ్లు
మా వాకిళ్లు దయనీయావస్థలకు ఆనవాళ్లు
చదువుల్లేవ్..పదవుల్లేవ్
కంటక కాటక పరిస్థితుల్నెదిరించే
సామర్థ్య కొలువుల్లేవ్
బీళ్ల నేలతో సంసారం
రాళ్ల నేలతో సంపర్కం
ఆకాశం వైపు ఆశల చూపు
పవనాల పయనాలు
అనూహ్యమై అమేయ బలీయమై
నీరులేక నారు లేక పైరు లేక
వాడుముఖం పాడుముఖం గోడుముఖం
జలకళ మృగ్యమై
జీవకళ అదృశ్యమై
ఎండుడొక్కల ఎడ్లకు మేతలేక
గాదెలు నింపే వడ్లకు రాతలేక
పతనమే పరాకాష్ఠగా
ఉత్థానమే ఉపవిషగా
బతుకు బేజారు..చితికి దరిచేరు
కోటం చంద్రశేఖర్ 9492043348
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

