ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ నజర్
క్యాన్సర్ వైద్య సేవల్లో ఖ్యాతి పొందిన ఒమేగా హాస్పిటల్స్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
- తెలంగాణ, ఏపీ సహా 5 రాష్ర్టాల్లోని 24 ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు
- పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ వైద్య సేవల్లో ఖ్యాతి పొందిన ఒమేగా హాస్పిటల్స్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేతలు, భారీగా అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఒమేగా హాస్పిటల్స్ శాఖలతోపాటు వాటి వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ మోహన వంశీ, ఇతర కీలక వైద్యులు, ఉన్నతాధికారుల నివాసాలు, కార్యాలయాలు సహా 24 ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య విసృ్తత సోదాలు నిర్వహిస్తున్నారు.
‘ఒమేగా’ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్డిస్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా 2010లో ప్రారంభమైన ఒమేగా హాస్పిటల్స్‌కు గుంటూరు, విశాఖపట్నం, భీమవరం, కర్నూలు, తిరుపతి, కరీంనగర్, జబల్పూర్, డెహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో శాఖలు ఉన్నాయి. ఇవి సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, కీమోథెరపీ, రేడియో సర్జరీ తదితర వైద్య సేవలను అందిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

