ఆత్మగౌరవ పతాక
దళితులంటే...... పాకీలుగా పారిశుద్ధ్య పరిరక్షకులుగా పాలేర్లుగా పని పిల్లలుగా కర్మ సిద్ధాంతపు కోరల్లో చిక్కుకొని మనువాదపు మకిలిని మోస్తూ
దళితులంటే……
పాకీలుగా పారిశుద్ధ్య పరిరక్షకులుగా
పాలేర్లుగా పని పిల్లలుగా
కర్మ సిద్ధాంతపు కోరల్లో చిక్కుకొని
మనువాదపు మకిలిని మోస్తూ
కట్టు బానిసలుగా కాలాన్ని వెల్లదీస్తు
కలలు చిద్రమై బతుకు భారమై
అవమానాల అగ్నిగుండంలో హాహాకారాలు చేస్తున్న
కడగొట్టు బిడ్డల కష్టాలు తీర్చగా
దళిత బంధు తోటి బతుకుబాటను చూపి
ప్రగతి పథానికై పది లక్షలందించి
అర్హులైన వారి అభిరుచులను బట్టి
వెలివాడలందున వెలియంగా పరిశ్రమలు
పెట్టి చాకిరి మాని యజమానిగా మారి
ఆర్థిక స్వాలంబనతో ముందడుగు లేస్తూ
తమ అభివృద్ధిని తామే అమితానందంగా
నిర్వచించుకునే దిశగా చైతన్యమై సాగిపోతూ
ఉత్పత్తిలో భాగస్వాములై ఉరకలు వేస్తూ
సాధికారతను సాధిస్తూ సంఘటితమై
తరతరాల అంధకార బంధనాలను తెంచుకొని
విద్యా దీపులై ప్రజ్వలిస్తూ
ఆత్మగౌరవ పతాకలై అవరోధాలను దాటుతున్నారంటే
నేటి తెలంగాణ పాలికల పథకాల ఫలితం
కాదని ఎలా చెప్పగలం….!!

Dr. Thallapalli Yakamma– డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ
ఇంటి నం : 1 – 6 – 64
గుమ్ముడూర్ బజార్
మహబూబాబాద్ జిల్లా
ఫిన్ నం : 506101
తెలంగాణ రాష్ట్రం
ఫోన్ : 9704226681
Mail : thallapalliyakamma@gmail.com
Read Today's Latest Literature-more Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

