కరువు తెచ్చి గావుకేకలా?
aకంచే చేనుమేస్తే అన్నట్టు.. కరువు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన సర్కారే చేజేతులా రాష్ర్టాన్ని కరువులోకి నెట్టివేస్తే? ఎండిపోయిన పొలాల సాక్షిగా నేడు తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది ఈ అసాధారణ చారిత్రక విషాదమే. సాగును సాగించలేని విపత్కర పరిస్థితులు వస్తే దిక్కుతోచని రైతులు సర్కార్‌కు సాయం కోసం మొరపెట్టుకుంటారు.
aకంచే చేనుమేస్తే అన్నట్టు.. కరువు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన సర్కారే చేజేతులా రాష్ర్టాన్ని కరువులోకి నెట్టివేస్తే? ఎండిపోయిన పొలాల సాక్షిగా నేడు తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది ఈ అసాధారణ చారిత్రక విషాదమే. సాగును సాగించలేని విపత్కర పరిస్థితులు వస్తే దిక్కుతోచని రైతులు సర్కార్‌కు సాయం కోసం మొరపెట్టుకుంటారు. కానీ ఇక్కడ సర్కారే దేహియని రైతుల సాయాన్ని అర్థించే విలోమ దృశ్యాన్ని చూడాల్సి వస్తున్నది. జలాశయాల్లో నుంచి నీరు దిగువకు జారిపోతుంటే చోద్యం చూసిన సర్కార్, నీళ్లు లేవు కనుక సాగునీరు అవసరమయ్యే వరిలాంటి పంటలు వేయొద్దని రైతులను వేడుకుంటున్న స్వరంలో హెచ్చరిస్తున్నది. కష్టాల్లో నుంచి బయటపడే దారి చూపాల్సిన ప్రభుత్వ పెద్దలు తమకే దారి తెలియక బిక్కమొఖం వెయ్యడం ఏమిటి? ఏమన్నా అంటే ఎల్ నినో అంటూ గావుకేకలు, పెడబొబ్బలు. ఎల్ నినో అనేది ఇప్పటికిప్పుడు రాలేదు. మనకు ఒక్కరికే రాలేదు. ఇరుగుపొరుగులకు కూడా వచ్చింది. వారికి వందల టీఎంసీలు పారితే మనకు పదుల టీఎంసీలే కరువయ్యాయి. ఏపీ బాబులు వందల కిలోమీటర్లు పారించుకుని సంబురపడిపోతుంటే ఇక్కడ మరుగుజ్జు నేతలు బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయారు. కాదుకాదు, అలా నటిస్తున్నారు. నీటిని ఒడిసిపట్టడంలో రెండు రాష్ర్టాల నాయకత్వం మధ్య తేడాలు ఎందుకు కనబడుతున్నాయి? అంటే పొరుగు దొంగలకు సద్ది గట్టే ఇంటోడి నిర్వాకమని తెలియడం లేదా? ప్రస్తుత నీటి పరిస్థితి ఇక్కడి నాయకత్వం వికృత ధోరణికి నిలువెత్తు అద్దం పడుతున్నదని చెప్పవచ్చు.
వరద వచ్చినప్పుడు నీటిని ఎత్తిపొయ్యని బురద రాజకీయం ఇవాళ మన రాష్ట్రం పాలిట శాపంగా మారింది. కరువును శాశ్వతంగా తరిమికొట్టేందుకు కాళేశ్వరం తదితర ప్రాజెక్టులతో కేసీఆర్ మహాజలసిరిని సంతరించి పెడితే, కల్లబొల్లి కబుర్లతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ చేతగాని, చేవలేని పాలనతో కృత్రిమ కరువును మన నెత్తిన తెచ్చిపెట్టింది. అసలు ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉన్నదో కూడా తెలియని అజ్ఞానులు కాళేశ్వరంపై విషం కక్కుతున్నారు. ఆ బృహత్తరమైన ప్రాజెక్టులో చిన్న కుంగుబాటు జరిగితే భూతద్దంలో చూపి హంగామా చేస్తారు. మొత్తం ప్రాజెక్టునే పండబెట్టి సాగును ఆగమాగం చేస్తారు. అసలింతకూ కన్నెపల్లి నుంచి నీటిని ఎక్కడికి ఎత్తిపోస్తారు? దిగువకు వదిలితే దానిని ఎత్తిపోయడం అంటారా? నీటి గురించి ఓనమాలు తెలియని వీళ్లు ఈ రాష్ర్టాన్ని ఉద్ధరిస్తారట!
నీరు అందక పంటలు కొరిప్రాణానికి వచ్చేవరకు ఎదురు చూసి ఆపై కరువు కరువు అంటూ సీఎం పెడబొబ్బలు పెడుతున్నారు. ఇన్నాళ్లూ నీళ్లు ఎత్తిపోయకుండా కాలక్షేపం చేసి ఇప్పుడే నిద్రలేచి, ఇది మరో కరోనా వంటి పరిస్థితి, కనివిని ఎరుగని కరువు అంటూ బూచిని చూపి దడిపిస్తున్నారు. అవును నిజమే. ఇది అచ్చంగా కనివిని ఎరుగని కరువే. ఇదంతా సర్కార్ పుణ్యమే. దీనినే ప్రజలు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పుకొంటున్నారు. ఇప్పటికీ మిగులుబొగులు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ పని చేయాలంటే కరెంటు కొనాలి. అందుకు డబ్బులు కావాలి. చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి. అదే జరిగితే రైతులు బోర్లు నడిపి, పంటలు వేస్తరు. మళ్లీ కరెంటు కావాలి. రైతులు నాట్లు వేస్తే యూరియా సరఫరా చేయాలి. చివరకు పంట కొనాలి. బోనస్ ఇవ్వాలి. ఇందులో ఏదీ సర్కార్‌కు చేతగాదు. అందుకే క్రాప్ హాలిడే అంటూ అసమర్థ రాగం ఎత్తుకున్నది. పోనీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సర్కార్ దగ్గర ఏమైనా ఉన్నాయా? అంటే అదీ ఉత్తముచ్చటే. నదీజలాలు చేజారిపోయి సాగుకు సంకటం చుట్టుకున్నది. ఇప్పటికైనా సర్కార్ పూర్తిగా కండ్లు తెరవాలి. కరువు గురించి సీఎం రేవంత్‌రెడ్డి బీభత్స భయానకంగా మాట్లాడటం మానుకోవాలి. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు సీఎం భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటి? సర్కార్ ఈ నాటకాలను కట్టిపెట్టి నదుల్లో ఇప్పుటికైనా నీటిని ఒడిసిపట్టేందుకు కదలాలి. లేకపోతే తాగునీటికీ కరువు వచ్చి, ప్రజలు నరకం అనుభవించే దుస్థితి దాపురిస్తుంది. తస్మాత్ జాగ్రత్త!
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

