శ్లో : వల్లీపలిత కాయోపి
కర్తవ్యం శృతి సంగ్రహః
నతత్ర ధనినో యాంతి
యత్రయాంతి బహుశ్రుతాః
తా: శరీరము కృశించి తీగవలె మారినను, వెంట్రుకలు నెరిసినను అనగా చా లా వృద్ధుడైనప్పటికిని వేదశాస్త్ర అధ్యయనము చేయుచునే ఉండవలెను. ఎందుకనగా ధనికులు పోలేని చోటికి కూడా శాస్ర్తాధ్యయనపరుడు పోగలుగుతాడు.
– టి.సుధాకరశర్మ