GT vs PBKS | గుజరాత్‌ను గెలిపించిన సుందర్.. పంజాబ్‌కు వరసగా రెండో షాక్..!
GT vs PBKS : టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings)కు వరసగా రెండో షాక్. లో స్కోరింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది.
GT vs PBKS : టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings)కు వరసగా రెండో షాక్. లో స్కోరింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సాయి సుదర్శన్(57) అర్ధశతకంతో మెరవగా.. చివరిదాకా నిలబడిన సుందర్(40 నాటౌట్) గుజరాత్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో సుందర్ ఫైనల్ లెగ్ సిక్సర్ బాదగా ఆరో విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ జయభేరి మోగించింది. మోస్తరు ఛేదనలో ఓపెనర్ సాయి సుదర్శన్(57) ఖతర్నాక్ హాఫ్ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(40 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్‌ను 163కే కట్టడి చేసిన గుజరాత్ టైటాన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్ ఆదిలోనే షాకిచ్చాడు. శుభ్‌మన్ గిల్(5) ఔటయ్యాక జోస్ బట్లర్(26), సాయి సుదర్శన్(57)లు ఇన్నింగ్స్ నిర్మించారు. గుజరాత్‌ను గెలుపు దిశగా నడిపిస్తున్న ఈ జోడీని ఇంప్యాక్ట్ సబ్ విజయ్ కుమార్ విడదీశాడు. నిశాంత్ సంధు(15).. విఫలమవ్వగా.. సుదర్శన్ దూకుడుగా ఆడి అర్ధశతకం సాధించాడు.
CAUGHT HIM!!!! 🙌
🎥 A fantastic catch by Cooper Connolly to make things interesting 🫣
Updates ▶️ https://t.co/9vBsQTIV2x#TATAIPL | #KhelBindaas | #GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/awIBoCY937
— IndianPremierLeague (@IPL) May 3, 2026
విజయ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టాలనుకున్న అతడు బౌండరీ వద్ద బార్ట్లెట్ చేతికి చిక్కాడు. అప్పటికి గుజరాత్ విజయానికి 30 బంతుల్లో 41 రన్స్ కావాలి. సుందర్(40 నాటౌట్) నిలబడినా.. ఇంప్యాక్ట్ సబ్ తెవాటియా(2)ను యాన్సెన్ ఔట్ చేయడంతో పంజాబ్ ఆశలు చిగురించాయి. కానీ, బంతితో తమను దెబ్బకొట్టిన హోల్డర్(5)ను కొన్నొల్లీ అద్భుత క్యాచ్‌తో వెనక్కి పంపాడు. 6 బంతుల్లో 11 రన్స్ అవసరమవ్వగా.. అర్షద్ ఖాన్ బౌండరీ.. సుందర్ ఫుల్ టాస్‌ను ఫైన్ లెగ్‌లో సిక్సర్‌గా మలవగా 4 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది.
రాణించిన సూర్యాన్ష్, స్టోయినిస్
పంతొమ్మిదో సీజన్లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్‌ను అహ్మదాబాద్‌లో తడబడింది. సుడిగాలిలా విరుచుకుపడే ఓపెనర్లకు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు బ్రేకులు వేయగా మోస్తరు స్కోరే కొట్టింది. తొలి ఓవర్లోనే సిరాజ్(2-28) డబుల్ షాకివ్వగా.. జేసన్ హోల్డర్(4-24) చకచకా మిడిలార్డర్ పని పట్టాడు.

47కే ఐదు కీలక వికెట్లు పడిన వేళ అన్క్యాప్డ్ ప్లేయర్ సూర్యాన్ష్ షెడ్గే(57), మార్కస్ స్టోయినిస్(40)లు నిలబడ్డారు. గుజరాత్ బౌలింగ్ దళాన్ని కాచుకొని స్కోర్ 120 దాటించారు. ఈ జోడిని హోల్డర్ విడదీయడంతో పంజాబ్ 163కే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

