హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు ‘అమృతలత-అపురూప అవార్డ్స్’ ప్రదానోత్సవం జరుగుతుందని అవార్డ్స్ కన్వీనర్ నెల్లుట్ల రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్జూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసెల్ కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ జి.సుధారాణి ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు.
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, సినీనటి మంజు భార్గవి విశిష్ట అతిధిగా పాల్గొంటారని తెలిపారు. లలిత సంగీతం విభాగంలో డాక్టర్ హైమావతి భీమన్న, నవ లా రచన విభాగంలో డాక్టర్ పెళ్లకూరు జయప్రద, శాస్త్రీయ సంగీతం విభాగంలో బుర్రా వరహాలు అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను అందుకుంటారని తెలిపారు.