వాటి మానాన అవి
మేస్తున్నవి
మేత కోసం వాడు
వాటిని కోస్తున్నడు
నిరపేక్షంగా కొమ్మ
పూసింది కాసింది
ఆపేక్షగా వాడు
వాటిని అందుకొన్నడు
ఆకులు ఊసులాడాయి
గాలి శబ్దించింది
మనిషి, స్వార్థం, హింస
మాటలు వినిపించాయి
మనలో ఒకడే
మాటతో వేరయ్యాడు
మన నెత్తికెక్కాడు
ప్రకృతి ప్రకోపించింది
-డాక్టర్ బీవీఎన్ స్వామి
9247817732