చెలి తలపులు తలనుతట్ట
చెంతచేర కోర్కెకలిగె
గుండెలోన గుబులుపుట్ట
ఇల్లుచేర కోర్కె కలిగె
చెలి పలుకులు గుర్తుకొచ్చి
తియ్యదనము రుచినిచూప
చిరునవ్వులు కనమనసయి
బయలుదేర కోర్కె కలిగె
చెలి చేష్టలు మదినిముట్ట
సంతసంబు సంగ్రహించ
మూటముల్లె సద్దుకోని
ఊరుచేర కోర్కె కలిగె
చెలి రూపము భ్రమ
కొలుపగ తక్షణమే చూడాలని
హృదిమురియ హుటాహుటిన
సఖినిచేర కోర్కెకలిగె
చెలిసరసం జ్ఞప్తికొచ్చి
శ్రీఘ్రంగా పయనమవ్వ
బండినెక్కి దూసుకెళ్లి చెలిని
చేర కోర్కెకలిగె
చెలి మోమును తలచుకొనగ
ఎగిరిపోయి వీక్షిస్తూ
సమయాన్ని గడపాలని
సకియచేర మనసుకలిగె
– గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్