అనంతవిశ్వం భగవంతుని సృష్టి, ఒక అద్భుతం, వర్ణింపనలవికాని అందమైన కావ్యం. మానవ మేధస్సుకు అందని రహస్యాల పొత్తం. తరతరాలకు తరగని విజ్ఞాన సంపదల కదంబం. ఇంతటి గొప్ప సృష్టిలో పంచభూతాలతో కూడిన అందమైన ప్రకృతి అనంత కోటి జీవరాశులకు ఆధారభూతం. అందులో మానవ జన్మ ఒకటి. మనిషి భౌతిక దేహం పంచభూతాలమయం. కనుకే అనాది నుంచి నేటి వరకు మానవ పరిణామక్రమం ప్రకృతితో మమేకమై ఉన్నది.
భారత దేశం వేదభూమి, కర్మభూమి, తపో భూమి. మన మహర్షులు అందించిన గొప్ప సంపద వేదాలు, పురాణా లు, ఉపనిషత్తులు, సనాతన ధర్మ సూత్రాలు మరెన్నో. భారతీయులు వీటి ఆధారంగా పరిస్థితులకు అనుగుణంగా తమ తమ ప్రాంతాలకు తగినవిధంగా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవనశైలిని ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.
పురాణాల ప్రకారం దేవుళ్ళందరూ ఒకరే అయినా వారి రూపు రేఖలు , వారిని కొలిచే విధానం, వారి భక్తి విశ్వాసాలు ప్రాంతీయ ఆచారాలకు తగ్గట్టుగా వారి వారి పండుగలు చేసుకోవడం అన్నది తరతరాలుగా వస్తున్న ఆచారమే . ఇదే క్రమంలో తెలుగువారు తమ ఆచారంగా చేసుకునే ‘బతుకమ్మ’ పూల పండుగ, ప్రకృతి పండుగ. ఇది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా, తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
బతుకమ్మ: మానవాళి మనుగడకు ప్రకృతి చాలా ముఖ్యమని ప్రత్యక్షంగా, పరోక్షంగా చెపుతూ, సమైక్యతను కూడా చా టి చెపుతుంది బతుకమ్మ. పసు పు గౌరీదేవి సమేతంగా, ప్రకృతికి నిర్వచనంగా పంచభూతాల సాక్షిగా, బంధు మిత్ర సపరివారంగా పల్లె, పట్టణ ప్రజలందరూ కలిసి జరుపుకునే ఒక గొప్ప పండుగ. భగవంతుడిపై విశ్వా సం భక్తిభావం ఉట్టిపడే విధంగా, చక్కని సాహిత్యంతో, చరిత్ర నేపథ్యంగా రాసిన పురాణ, జానపద, వీరగాధలను పాటలుగా పాడడం వలన వారిలో ఉత్తేజం పెల్లుబికి మనుషులు చైతన్య వంతంతులుగా అవుతారు. ఈ పాటల వల్ల మనుషుల జీవన విధానాలు, గుణగణాలు, వారిలోని రాగద్వేషాలు, చరిత్ర, పురాణాలలోని ఘట్టాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
బతుకమ్మ పండుగలో సమాజానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాలు మనుషుల జీవన శైలిని తెలిపే ఆచార వ్యవహారాలు సమైక్యత, మానవ సంబంధ బాంధవ్యాలు, ఆరోగ్య రహస్యాలులాంటి ఎన్నో గొప్ప గుణా లు ఉన్నాయి. కనుకే ప్రకృతి జీవనవేదంగా బతుకమ్మను తెల ంగాణ ప్రజలేగాక దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారందరూ జరుపుకోవడం వలన ఇది అత్యంత ప్రసిద్ధి పొంది, సంప్రదాయాత్మకమై మానవాళికి సందేశాత్మకంగా విరాజిల్లుతుంది.
(అక్షరయాన్ సౌజన్యంతో)
-శేర్ భారతిమూర్తి