బండ్ల తారకేష్ రచించిన ‘నారీ మధుతారకలు’ నానీల కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుందని కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ అధినేత మద్దాళి రఘురాం తెలిపారు.
డాక్టర్ ఎన్.రఘు అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్.గోపి ముఖ్యఅతిధిగా పాల్గొని ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సజ్జా వెంకటేశ్వర్లు, కుడికాల వంశీధర్, డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.