మా తెలంగాణ తల్లికి నాల్గుకోట్ల వందనాలు మా బంగారు తల్లికి బంతిపూల దండలు ఘనమైన చరిత నీది జననీ నీరాజనాలు తర తరాల కీర్తి నీది తల్లి జేజేలు .. గల గల సవ్వడులతో కదలివచ్చె గోదారమ్మ పాల నురుగుల వోలే ప్రవహించే కృష్ణమ్మ బంగరు పంటలు అందించే తల్లిధరణి కాంతిపూలు సృష్టించే సిరులగని సింగరేణి ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. భాగవత సుధను పంచిన బమ్మెర పోతన్న భద్రాచల రామయ్య ను కీర్తించిన రామదాసు కీర్తన రామప్ప గుడివాకిట రమణీయ శిల్ప కన్నియల నర్తనం కాకతీయ శిల్పుల ప్రతిభకు తార్కణం స్వాగతతోరణం ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. అఖండ భారతావని పాలించిన తొలి తెలుగురేడు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రభవించిన పావననేల శాతవాహనుల తొలి రాజధానిగా విలసిల్లిన చెరిగిపోని చరితగా నిలిచిన కోటిలింగాల.. ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. కరవాలం ఝళిపించి కదనంలో దూకిన రాణీ రుద్రమ్మ సమ్మక్క సారక్కలు చేసిన అసమాన పోరుసీమ గుండె నిండ కొండంత బలమున్న కొదమసింహం కొమురం భీమన్న రక్కసి రజాకార్ల నెదిరించి పోరాడిన వీరనారి చాకలిఐలమ్మ ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. గొప్పగ పాలించిన గోలకొం డ నవాబులు రాజభక్తి మేధాశక్తి కలబోసిన అక్కన్న మాదన్నలు భాగమతి పేరున ప్రభవిం చిన భాగ్యనగరు ప్రపంమచమే మెచ్చిన చక్క నైన చార్మినారు ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. కణ కణ రగిలే కవితలు విసిరి గొడవ చేసిన కాళోజీ కవితల కత్తులు దూసి నైజాముకు దడపుట్టించిన దాశరథి తెలంగాణ కవుల ఉనికిని జగతికి చాటిన సురవరం విశ్వంభరా కావ్యం సృష్టించి జ్ఞానపీఠమదిష్టించన సినారె ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. బహుభాషా కోవిధుడు అపర చాణక్యుడు భారతావనినేలిన ప్రధానమంత్రి అతడు పరిపాలనా ధక్షుడుగా పేరు గాంచినవాడు అతడే అతడే పీ.వీ.నరసింహుడు ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. జయశంకర్ సంకల్పం కేసీఆర్ ఉద్యమసారథ్యం సబండవర్ణాలు విద్యార్థులు మేధావులు కవిగాయకులు కదలివచ్చి కదమంతొక్కి చేసిన సమరం సాధించింది సాధించింది స్వరాష్ట్రం ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. కన్నులు మెచ్చేటి మనసుకు నచ్చేటి లంబాడోళ్ళ నాట్యాలు సంబ్రమాశ్చర్యాలు కలిగించే సాధానసురుల విధ్యలు మైమరపించును చక్కనైన ఒగ్గుకథల సుద్దులు డప్పులు వాయిస్తూ దరు వుకు చిందేసే దళిత కళాకారులు ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. జాజిరి పాటలు జానపద గేయాలు బతుకమ్మ ఆటలు బోనాల జాతరలు సుద్దాల హనుమంతు పాటలు కాపురాజయ్య చిత్రాలు అలిశెట్టిప్రభాకర్ కవితలు గద్దర్ పాడుతున్న పాటలు ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. యాదగిరి నరసింహుడు భధ్రాచల రాముడు వేములవాడ రాజేశుడు కాళేశ్వర ముక్తేశుడు కొమురవెల్లి మల్లన్న కొండగట్టు అంజన్న అలంపూర్ జోగులాంబా బాసర శారదాంబా చల్లని చూపుల దీవెనలు ప్రసరిచే భాగ్యసీమ నాలుగుకోట్ల జనులు నడయాడే బంగరు సీమ ఇదే తెలంగాణ..ఇదే ఇదే తెలంగాణ.. [caption id="attachment_1110991" align="alignnone" width="124"] Boora Devanandam[/caption] - బూర దేవానందం 8143589789. సిరిసిల్లా టౌన్ రాజన్న సిరిసిల్ల జిల్లా