హిచ్‌కాక్ అంటే సినిమాకు నడకలు నేర్పిన దిగ్దర్శకుడు. సస్పెన్స్‌కు మారుపేరు. ఓ బ్రాండ్, ఓ ప్రపంచం. ఆయన తీసిన ఒక్కో సినిమా గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఎందరో దర్శకులకు ఆరాధ్యుడు. ఆయనను అనుసరించి ఎన్నో భాషల్లో, ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి.
సస్పెన్స్ సినిమాలకు హిచ్‌కాక్ గీటురాయి. మచ్చుకు ‘సైకో’, ‘బర్డ్డ్ ఆయన పేరు మీదే ‘హిచ్‌కాక్ ప్రెజెంట్స్’ అనే టీవీ షో సుదీర్ఘకాలం నడిచింది. అంతేకాకుండా ‘హిచ్కాక్స్ మిస్టరీ మ్యాగజైన్’ పేరిట ఓ పత్రిక కూడా వచ్చిం ది. చివరికి ఆయన జీవితం మీదే ఆంథోనీ హాప్కిన్స్ ప్రధాన పాత్రధారిగా ‘హిచ్‌కాక్’ అనే టైటిల్‌తోనే సినిమా వచ్చింది. అలాం టి దర్శక దిగ్గజం గురించి ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ అనే పుస్తకాన్ని తెచ్చిన పులగం చిన్నారాయణ, రవి పాడి చేసింది సాహసం అంటే చిన్నమాట అవుతుంది. నిజానికిది బయోగ్రఫీయో లేదా ఫిల్మోగ్రఫీ యో కాదు. హిచ్‌కాక్ సర్వస్వం ఇది.
సిం గీతం శ్రీనివాసరావు వంటి దర్శకులు, వీఏకే రంగారావు వంటి పేరొందిన విమర్శకులు, రచయితలు, పాత్రికేయులు రాసిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. అందరూ అభిమానంగా, అపురూపంగానే రాశారు. అంతమంది రచనలను పోగు చేసి, అందంగా గుదిగుచ్చి అం దించారు సంపాదక ద్వయం. సినిమాల చుట్టూ అల్లుకున్న విశేషాలకైతే లెక్కేలేదు. వీటిని సినీ పరిభాషలో ట్రివియా అంటారు. బాపురే అనిపించే స్థాయిలో ఉన్నదీ పుస్తకంలోని సేకరణ. దీన్ని హడావుడిగా చదివి పక్కనపడేయొచ్చు.
తాపీగా పూర్తి చేయవచ్చు. లేదా రిఫరెన్స్ గ్రంథంలా వాడుకోవచ్చు. హిచ్‌కాక్ తొలినాళ్లలో తీసిన సైలెంట్ మూవీస్‌తో సహా దేన్నీ వదిలిపెట్టకుండా సర్వ సమగ్రంగా తేవడానికి జరిపిన ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేం. సినీ పబ్లిసిటీ ఆర్టిస్టుగా సుప్రసిద్ధుడైన ఈశ్వర్ రూపొందించిన అందమైన ముఖచిత్రం తో వెలువడిన 500 పైచిలుకు పేజీల ఈ ఉద్గ్రంథం తెలుగు సినీ సాహిత్యానికి ఓ కొత్త ఒరవడి దిద్దిందని చెప్పవచ్చు. హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, ఆయ న తొలి సినిమా వందేండ్లు పూర్తిచేసు కున్న సమయంలో ఈ పుస్తకం రావడం విశేషం.
– రఘురాములు తుమ్మలపల్లి 93463 28291