ఔషధ వృక్షం
అతడు తన గాయాలకు ఆమెను ఔషధ వృక్షంగా హృదయంలో నాటుకున్నాడు
అతడు తన గాయాలకు
ఆమెను ఔషధ వృక్షంగా
హృదయంలో నాటుకున్నాడు
ఆమెకు మొలిచాక తెలిసింది
ఓ కథకి పునాదినని
ఓ కలకు తీపి నిద్రనని..
కానీ ఓ అబద్ధంలా ఈ నిజం
కాలంతో యుద్ధం చేస్తున్నా
ఆమే రాత్రి అతడికి
అతడే పగలు ఆమెకు
ఏ కలకు జత కూడని నిజంతో
క్షణమాగని వీరి ప్రయాణంలో
అతడు ఎంత నడిచినా
ఆమె దూరమే
ఆమె ఎంత దూరంగా ఉన్నా
అతడు దగ్గరే
ఇదే లోతుగా
జీవనదిలా ప్రవహించే
ఇష్టం ఒడ్డున
ఒంటరిగా
ఎవరికి వారే
ఇంకొకరి వైపు పొంగుతుంటారు!
– చందలూరి నారాయణరావు 97044 37247
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

