Ebola Vaccine | ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తున్న ఎబోలా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కొనుగొన్న రష్యా..
Ebola Vaccine | ఆఫ్రికా దేశాల (African Countries) ను వణికిస్తున్న ఎబోలా కొత్త వేరియంట్ (Ebola new variant) కు తమ శాస్త్రవేత్తలు సరికొత్త వ్యాక్సిన్ (Vaccine) ను కనుగొన్నట్లు రష్యా (Russia) ప్రకటించింది. కాంగో (Congo), ఉగాండా (Uganda) దేశాల్లో బుండిబుగ్యో (Bundibugyo) అనే కొత్త రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)’ ఇప్పటికే అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
Ebola Vaccine : ఆఫ్రికా దేశాల (African Countries) ను వణికిస్తున్న ఎబోలా కొత్త వేరియంట్ (Ebola new variant) కు తమ శాస్త్రవేత్తలు సరికొత్త వ్యాక్సిన్ (Vaccine) ను కనుగొన్నట్లు రష్యా (Russia) ప్రకటించింది. కాంగో (Congo), ఉగాండా (Uganda) దేశాల్లో బుండిబుగ్యో (Bundibugyo) అనే కొత్త రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)’ ఇప్పటికే అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ ప్రాణాంతక వేరియంట్‌కు ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు పొందిన టీకా లేకపోవడంతో రష్యా తెచ్చిన కొత్త ఆవిష్కరణకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రస్తుతం సెంట్రల్ ఆఫ్రికా దేశాల్లో బుండిబుగ్యో ఎబోలా రకం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగోలో దీని తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇప్పటికే అక్కడ వందల మంది ఈ వైరస్ బారినపడ్డారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించడంతో అంతటా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఎబోలా వ్యాక్సిన్లు కేవలం ‘జైర్’ అనే పాత వేరియంట్‌పై మాత్రమే పనిచేస్తుండటంతో ఈ కొత్త ముప్పును అడ్డుకోవడం వైద్య నిపుణులకు సవాలుగా మారింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో ఈ కీలక ప్రకటన చేశారు. తమ దేశ పరిశోధకులు తయారు చేసిన కొత్త టీకా ఈ అరుదైన బుండిబుగ్యో వేరియంట్ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆఫ్రికా దేశాలకు ఎబోలా నిర్ధారణ కిట్లు, అవసరమైన వైద్య సాయాన్ని కూడా అందిస్తామని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్, అమెరికా పరిశోధకులు కూడా ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. రష్యా ఆవిష్కరణపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నప్పటికీ అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు మాత్రం కొన్ని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ డేటాను రష్యా ఇంకా బహిరంగంగా వెల్లడించకపోవడంపై అనుమానాలున్నాయి. ప్రజల్లోకి ఈ టీకాను విస్తృతంగా తీసుకెళ్లడానికి ముందు ప్రయోగాలు, శాస్త్రీయ విశ్లేషణలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. అప్పటివరకు వైరస్ నిర్ధారణ, రోగుల ఐసోలేషన్ వంటి నివారణ చర్యలే ప్రధాన ఆయుధాలని పేర్కొంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

