Jagapathi Babu | రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర బృందం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా, ఇటీవల జరిగిన కొన్ని ఈవెంట్లలో రామ్ చరణ్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొన్ని సందర్భాల్లో పేర్లు మర్చిపోవడం, బెంగళూరు ఈవెంట్లో కొద్దిగా కన్నడలో మాట్లాడటం వంటి అంశాలపై కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ చిత్రంలో అప్పలసూరి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న జగపతి బాబు తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌తో పాటు తనపై గతంలో వచ్చిన విమర్శలపైనా స్పందించారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. “ట్రోలింగ్ చేసే వాళ్ల గురించి నేను పెద్దగా పట్టించుకోను. పనిలేని వాళ్లు ఎవ్వరినైనా కిందకి లాగాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తుంటారు. చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు, ఎన్ని గాయాలు అయ్యాయి, ఎంత శ్రమించాడు అనే విషయాలను పక్కనపెట్టి చిన్న విషయాలను పట్టుకుని పెద్దదిగా చేస్తున్నారు” అని అన్నారు.అలాగే ఒక పెద్ద సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోలపై ఎంత ఒత్తిడి ఉంటుందో కూడా ఆయన వివరించారు. “ఒకవైపు డబ్బింగ్ పనులు, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్, థియేటర్ల వ్యవహారాలు.. ఇలా ఎన్నో బాధ్యతలు ఒకేసారి ఉంటాయి. ఆ ఒత్తిడిలో చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం సహజం.
నేను కూడా చాలా సందర్భాల్లో మర్చిపోతాను. అలాంటివాటిని పట్టుకుని ట్రోల్ చేయడం సరికాదు అని వ్యాఖ్యానించారు. ఇక తనపై గతంలో వచ్చిన ట్రోలింగ్‌పై కూడా ఆయన స్పందించారు. “ఒక సీన్ కోసం నేను 70 లేదా 80 టేక్స్ తీసుకున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఎక్కువలో ఎక్కువ మూడు టేక్స్ తీసుకుని ఉంటాను. పూర్తిగా ఫేక్ సమాచారంతో ట్రోలింగ్ చేశారు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రామ్ చరణ్‌ను సరికొత్త అవతారంలో చూపించనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్స్ మరింత జోరుగా కొనసాగుతున్నాయి.