అమ్మలక్కలకు ప్రత్యేకం ఆషాఢమాసం
అరచేతిలో విరుస్తుంది మైదాకు జాతకం
బొట్టు పెట్టి బయల్దేరే తెలంగాణ బోనం
ఆనందంతో ఆలకించు ఆంధ్ర జనం
శ్రావణమాసం ప్రత్యేకం సోమవారాల ఉపవాసం
ఉపక్రమించే వివాహ మహోత్సవాల శ్రీకారం
శ్రావణంలో ఆడిన ఉట్టి ఆటల చిన్నతనం
భాద్రపదంలో గణపతుల పూజలు ఘనం
ఆశ్వయుజంలో వైభవంగా బతుకమ్మ పండుగ
దాండియా మార్చెను దసరాను దండిగా
చెరువులన్నీ నిండుగా మత్తడులే దునుకంగా
ప్రకృతే పలకరించెను చేరువై మురిపెంగా
రాష్ట్రమంతా వినిపిస్తాయి కాళేశ్వర చప్పుళ్లు
రైతుబంధు తీరుస్తాయి కర్షకుల తిప్పలు
వెన్నెలనే తలదన్నే ఇంద్ర ధనుస్సు వన్నెలు!
ఇవన్నీ తెలంగాణ వానకాలపు తీరు తెన్నెలు!!
భార్గవ పొడేటి
87905 70051