అవినీతి విశ్వరూపమెత్తింది
విశ్వమంతా
విశ్వాసాన్ని కోల్పోయి
దోపిడీ కొమ్ము కాస్తున్నది
నీతి
గోతిలో కూరుకుపోయింది
నేతి బీర
నవ్వులొలకబోస్తున్నది
ధర్మ దేవత
గాంధారి రూపు దాల్చింది
మాటకు విలువ లేకుండా ఉంది
మూటలకు
వంత పాడుతున్నది
చట్టం
చట్ట బండలయినది
పీతాంబర
దారులకే పీటలేస్తున్నది
చేసిన పాపం
కాశీకే అంకితమంటున్నది
రక్త సంబంధాలకు
లుప్తమనే వ్యాధి సోకింది
ఆత్మీయత అనురాగం
ఎడారిలోన యుగళగీతమైనది
ఐక్యత బీడు పడిపోగా
నీతికి పట్టమెక్కడున్నది
అవినీతి అంతం కావాలంటే
కలుషాలకు నిలయమైన…
కలియుగాన్ని
మట్టుబెట్టే గుట్టు తెలియాలి
-నమిలకొండ నాగేశ్వర్రావు
86885 534570