నిద్రొస్తే నిద్రపో
మెలకువగా ఉంటే
ఈ రాత్రి ప్రియమైన వారిని
తిరిగి తీసుకురాలేదు
నా రాబోయే పుస్తకంలో
ప్రతి పేజీలో నీ పేరు రాస్తాను
ఎవరైనా అడిగితే మాత్రం
వెంటనే నీ గురించి రాస్తాను
తాను పేదవాడిని అనుకొని
నాకు వీడుకోలు పలికాడు
ఇవ్వడానికి ఏముంది
అతడి దగ్గర ప్రేమ తప్ప
జీవితంలో ఇలాంటి చిక్కులు
వస్తాయనుకోలేదు
ఏడవడం తప్పనిసరి
కొన్ని కన్నీళ్లు దాచుకోవాలి.
హిందీ మూలం: గుల్జార్
అనువాదం: వెన్నెల సత్యం, 94400 32210