మాశిపోయిన మా తెలంగాణకు
‘గులాబీ రంగు’లద్దిండు మా సారు
రైతుబంధిస్తే ‘పచ్చని’ పొలాలు
పందిరేశినట్లే ఉన్నయ్…
కట్టమీంచి వోతాంటే ‘నీలం రంగు’ల
కాళేశ్వర నీళ్లన్నీ కండ్ల్ల ముందు వారినట్లు
ఊళ్లె లగ్గం సప్పుడుకు అడబిడ్డ నుదుట
కల్యాణలక్ష్మి ‘ఎరువు రంగు’ తిలకమై మెరుస్తున్నది
బతుకమ్మ సీరంచుల్లో ‘పసుపు రంగు’
గుమ్మడి తీగోలే వారింది..!
నల్లవడ్డ సర్కారు బడి గోడలకు ‘తెలుపు’ రంగేస్తే
పిల్లలు ముసిముసి నవ్వుతర్రు
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లిస్తే..
ఇంద్ర ధనుస్సులన్నీ
ఇంటిగల్మళ్లకే అచ్చినట్లున్నయి
ఆసరా పింఛన్లందుకున్న అవ్వలందరి
బతుకులు ‘బంగారు’ రంగోలే మారినవ్.
ఇవే మా తెలంగాణ రంగులు..
నలుపు జాడలు పోయేటట్లు
మా సారు సల్లుతున్న పథకాల రంగులు..!
తుమ్మల కల్పనా రెడ్డి
96404 62142