గమ్మత్తు అసలు
ఈ సృష్టి ధర్మం
ఈ బతుకు పోరాటం
అంతులేని ఆరాటం…!
తల్లి కడుపులో
పిండమై ఉన్నప్పటినుండే
ఒక్కోనెల ఒక్కో భ్రమణం
తల్లీ బిడ్డల పరిక్రమం….!
పుడుతూనే పాలకు
పెరుగుతూ మురిపాలకు
జీవన యాత్రలో
తీరని కోర్కెలకై సాగే పయనం…!
భృతికోసం, ధృతికోసం కృతికోసం
కీర్తి కోసం, మరో కోరిక కోసం
అంతే ఎరుగని మృగతృష్ణ
తృప్తి లేని ఈ కస్తూరి మృగపు అన్వేషణ..!
కాదని తెలిసీ, రాదని తెలిసీ
ఉండనని తెలిసీ, ఆ ఇల్లే చివరని తెలిసీ
ఈ మిథ్యా ఇంటిని విడువలేని
అమాయకపు అలుపెరుగని పయనం..
ఈ జీవితం….
రమాదేవి కులకర్ణి
89856 13123